ఓటర్ల జాబితా రూపకల్పనకు సహకరించాలి

ఓటర్ల జాబితా రూపకల్పనకు

సమావేశంలో మాట్లాడుతున్న డిఆర్‌ఒ అప్పారావు

  • జిల్లా రెవెన్యూ అధికారి అప్పారావు

ప్రజాశక్తి – శ్రీకాకుళం

ఓటర్ల జాబితా రూపకల్పనకు అధికారులకు రాజకీయ పార్టీల నాయకులు సహకారం అందించాలని జిల్లా రెవెన్యూ అధికారి అప్పారావు కోరారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సాధారణ ఓటర్ల జాబితా రూపకల్పనపై షెడ్యూల్‌ ప్రకారం అధికారులు పనిచేస్తున్నారని చెప్పారు. బిఎల్‌ఒలతో బిఎల్‌ఎలు సమన్వయం చేసుకొని పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆయా పార్టీల ప్రతినిధులు గ్రామస్థాయిలో నూతన ఓటరు జాబితా రూపకల్పన, పోలింగ్‌ కేంద్రాల మార్పు అంశాలపై పలు సందేహాలను డిఆర్‌ఒ దృష్టికి తీసుకురాగా, అందుకు ఆయన స్పందించి చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో టిడిపి నాయకులు పి.ఎం.జె బాబు, వైసిపి నాయకులు రౌతు శంకరరావు, బిజెపి నాయకులు సురేష్‌ సింగ్‌, కాంగ్రెస్‌ నాయకులు కె.ఎల్‌.ఎస్‌ కుమారి, సిపిఎం నాయకులు ఆర్‌.ప్రకాశరావు, పలువురు తహశీల్దార్లు, ఎన్నికల డిప్యూటీ తహశీల్దార్లు, సి-సెక్షన్‌ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.ఇవిఎం గోదాముల తనిఖీత్రైమాసిక తనిఖీల్లో భాగంగా కలెక్టరేట్‌లోని ఇవిఎం గోదాములను కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ సోమవారం తనిఖీ చేశారు. గోదాములకు వేసిన సీళ్లను పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి సిబ్బందితో తెరిపించి పరిశీలించారు. అనంతరం వాటికి తిరిగి సీళ్లు వేయించారు. ఎన్నికల్లో వినియోగించిన, రిజర్వులో ఉంచిన ఇవిఎంలను సీరియల్‌ నంబరు, నియోజకవర్గాల వారీగా ఏ ప్రదేశాల్లో ఉంచారనే విషయాన్ని డిఆర్‌ఒ అప్పారావును అడిగి తెలుసుకున్నారు. ఇవిఎం గోదాముల పక్కన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

➡️