ఓటమి భయంతోనే జగన్‌పై దాడి

వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిపై ప్రతిపక్షాలు

ఆమదాలవలస : నిరసన తెలుపుతున్న స్పీకర్‌ తమ్మినేని సీతారాం, వైసిపి నాయకులు

శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం

ప్రజాశక్తి – ఆమదాలవలస

వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిపై ప్రతిపక్షాలు దాడికి పాల్పడ్డాయని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం విమర్శించారు. జగన్‌పై దాడిని ఖండిస్తూ మున్సిపాల్టీ పరిధిలోని ఊసవానిపేట జంక్షన్‌ వద్ద వైసిపి శ్రేణులతో కలిసి ఆదివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్‌ రెడ్డిని ఎదుర్కోలేక ప్రతిపక్షాలు దాడులను ప్రోత్సహిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాయని, ఇది హేయమైన చర్య అని అన్నారు. భౌతిక దాడులు ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదని ప్రజాస్వామ్య స్ఫూర్తితో న్యాయం, ధర్మానిదే విజయం కావాలి తప్ప.. వ్యక్తులపై దాడులకు దిగటం సిగ్గుచేటు అని అన్నారు. అధికార దాహానికి వ్యవస్థను బలి చేయకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపైనా ఉందన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా దాడులకు దిగుతున్న వ్యక్తులను గుర్తించి వారిపై ఉక్కుపాదం మోపాలన్నారు. దాడులను ప్రోత్సహిస్తున్న పార్టీల గుర్తింపును ఎన్నికల సంఘం రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కుటిల రాజకీయాలకు కేంద్రంగా నిలుస్తున్న చంద్రబాబుతో జత కట్టడం ద్వారా కూటమిలో మిగిలిన పార్టీలు ప్రజల్లో ఉనికిని కోల్పోయాయన్నారు. ప్రజాక్షేత్రంలో కూటమికి తగిన పరాభవం తప్పదన్నారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు బొడ్డేపల్లి రమేష్‌ కుమార్‌, ఎ.ఉమామహేశ్వరరావు, డి.శ్యామలరావు, బి.చిన్నంనాయుడు తదితరులు తదితరులు పాల్గొన్నారు.టిడిపికి అంతిమ ఘడియలు దగ్గరపడ్డాయినరసన్నపేట : తెలుగుదేశం పార్టీకి అంతిమ ఘడియలు దగ్గర పడ్డాయని.. అందుకే ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిపై దాడికి పాల్పడ్డారని ఎమ్మెల్యే, వైసిపి జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. జగన్‌పై దాడిని నిరసిస్తూ నరసన్నపేట పట్టణంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో వైసిపి ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్‌, వైసిపి మండల నాయకులు పాల్గొన్నారు.ఇచ్ఛాపురం : జగన్‌పై దాడిని నిరసిస్తూ ఎమ్మెల్సీ నర్తు రామారావు, మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్‌, నరేష్‌ కుమార్‌ అగర్వాలా తదితరులు నల్లబ్యాడ్జీలతో అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు పిలక రాజ్యలక్ష్మి, ఉప్పాడ నారాయణమ్మ, సాడి శ్యామ్‌ప్రసాద్‌ రెడ్డి, నర్తు నరేంద్ర యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.నౌపడ : సిఎం జగన్మోహన్‌ రెడ్డిపై దాడి అమానుష చర్య అని సంతబొమ్మాళి జెడ్‌పిటిసి పాల వసంత్‌రెడ్డి ఖండించారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మేమంతా సిద్ధం యాత్రకు వస్తున్న అపూర్వ ప్రజాదరణను ఓర్వలేక దాడి చేసిన ప్రతిపక్షాలకు ప్రజలు సరైన గుణపాఠం చెప్తారన్నారు.

 

➡️