ఓటమి భయంతోనే దాడులు

ఓటమి భయంతోనే

సమావేశంలో మాట్లాడుతున్న శిరీష

  • టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష

ప్రజాశక్తి – పలాస

ఓటమి భయంతోనే వైసిపి నాయకులు టిడిపి కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పలాస అభ్యర్థి గౌతు శిరీష అన్నారు. స్థానిక టిడిపి కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం టిడిపి శ్రేణులపై దాడులు చేయడం దుర్మార్గమన్నారు. మందన మండలం హరిపురం, పలాస మండలంలోని అమలకుడియా, పెదంచల, పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని చినబాడాంకు చెందిన టిడిపి నాయకులు పోలింగ్‌ కేంద్రాల్లో బూత్‌ ఏజెంట్లుగా ఉండడంతో, వారిపై దాడులకు పాల్పడ్డారని తెలిపారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, వాటిని సమానంగా తీసుకోవాలన్నారు. రాజకీయాలు హుందాగా చేయాలి తప్ప ప్రత్యర్థులపై దాడులు చేయడం హేయమైన చర్య అని అన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతమైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. టిడిపి నాయకులపై దాడికి సంబంధించి ఎస్‌పి, కాశీబుగ్గ డిఎస్‌పికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో తనకు సహకరించిన పలాస నియోజకవర్గ ప్రజలకు, టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో టిడిపి నాయకులు వజ్జ బాబూరావు, పి.విఠల్‌రావు, గురిటి సూర్యనారాయణ, గాలి కృష్ణారావు, కె.నర్సింహులు, మల్లా శ్రీనివాసరావు, టంకాల రవిశంకర్‌ గుప్తా పాల్గొన్నారు.

➡️