పోటీతత్వాన్ని అలవర్చుకోవాలి

క్రీడాకారులు పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని

క్రీడా జ్యోతి వెలిగిస్తున్న ఎమ్మెల్యే గౌతు శిరీష

ఎమ్మెల్యే గౌతు శిరీష

41 రాష్ట్ర టెన్నీకాయట్‌ పోటీలు

ప్రారంభంప్రజాశక్తి- పలాస

క్రీడాకారులు పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. పలాస జూనియర్‌ కళాశాల క్రీడా మైదానంలో శనివారం 41 రాష్ట్ర టెన్నీకాయట్‌ పోటీలను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి విద్యార్తీ క్రీడాకారులుగా తయారు కావాలన్నారు. జిల్లా కీర్తిని జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. గతంలో క్రీడలకు ఎటువంటి ప్రోత్సాహం ఉండేది కాదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. చదువులతో పాటు క్రీడలు ఆడిపించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుత క్రీడల్లో పురషులతో సమానంగా బాలికలు పాల్గొనడంపై వారికి తగురీతిలో ప్రోత్సాహం అందిస్తామన్నారు. పలాస క్రీడామైదానంలో ఏ క్రీడలు నిర్వహించినా విజయవంతం అవుతాయని, ఇక్కడ గెలుపొందిన క్రీడాకారులు జాతీయస్థాయిలో అనేక బంగారు పతకాలు సాధించారని గుర్తు చేశారు. అంతకుముందు క్రీడా, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. విద్యార్థులతో గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం క్రీడాజ్యోతి వెలిగించి క్రీడలు ప్రారంభించారు. రెండు రోజుల పాటు వివిధ జిల్లాలకు చెందిన క్రీడాకారులు తమ క్రీడా ప్రదర్శన ఇవ్వనున్నారు. విద్యార్థులు జాతీయ పతాకాన్ని చేపట్టి చేసిన విన్యాసాలు ఆకట్టుకోగా, విద్యార్థుల కోలాటం ప్రదర్శన మంత్రముగ్ధులను చేసింది. క్రీడా నిర్వాహకులు పి.తవిటయ్య అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఎంఇఒ సిహెచ్‌.శ్రీనివాసరావు, ఎపిటిపిసి చైర్మన్‌ వజ్జ బాబూరావు, టిడిపి నాయకులు పీరుకట్ల విఠల్‌రావు, టంకాల రవిశంకర్‌గుప్తా, బడ్డ నాగరాజు, సప్ప నవీన్‌, జోగ మల్లి, కొరికాన శంకర్‌, డాక్టర్‌ ఎం.మల్లేశ్వరరావు, విశ్రాంత ప్రిన్సిపాల్‌ మజ్జి పున్నయ్య, పిఇటిలు శేఖర్‌బాబు, హరి, పద్మలోచనరావు పాల్గొన్నారు.హోరాహోరీగా పోటీపలాస జూనియర్‌ కళాశాల క్రీడా మైదానంలో శనివారం ప్రారంభమైన రాష్ట్రస్థాయి టెన్నికాయిట్‌ పోటీలు హౌరాహౌరీగా సాగుతున్నాయి. రాష్ట్ర స్థాయి టెన్నీకాయిట్‌ పోటీలకు పది జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. విజయనగరం, విశాఖ పట్నం జిల్లాల మధ్య పోటీ నిర్వహించగా, విశాఖపట్నం జిల్లా నుంచి జె.సంతోష్‌ విజయం సాధించారు. శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లా మధ్య పోటీ నిర్వహించగా, జిల్లాకు చెందిన బి.జగదీష్‌ బెహరా, ఉదరు కిరణ్‌ విజయం సాధించారు. కార్యక్రమంలో కె.ఎన్‌.వి.సత్యనారా యణ, తవిటయ్య, హరిబాబు, పద్మలోచన, జి.రాజు, కె.రమేష్‌, జి.కానకరావు, అబ్దుల్‌ రెహమాన్‌, నాగరాజు, అలేఖ్య, రామారావు, వినరు, సంతోష్‌, చిరంజీవి పాల్గొన్నారు.

 

➡️