ఐటిడిఎ సాధనకు బైక్‌ ర్యాలీ

మెళియాపుట్టిలో ఐటిడిఎ

బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్న నాయకులు

ప్రజాశక్తి- మెళియాపుట్టి

మెళియాపుట్టిలో ఐటిడిఎ ఏర్పాటు చేయాలని, ఆదివాసీ గ్రామాలను ఐదో షెడ్యూల్డ్‌లో చేర్చాలని కోరుతూ అఖిల భారత రైతు కూలీ సంఘం సిపిఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ ఆధ్వర్యాన ఈ నెల 11న ధర్నా నిర్వహించనున్నారు. ఈ ధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ సిపిఐ ఎంఎల్‌ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు వంకల మాధవరావు ఆధ్వర్యాన మండలంలోని ముకుందపురంలో బుధవారం బైక్‌ ర్యాలీని ప్రారంభించారు. ముకుందాపురం, సున్నాపురం, గోవిందపురం, డబారు, గోడ్డూరు, అనంతగిరి, రింపి, నేలబొంతు గ్రామాల్లో ఈ ర్యాలీ సాగింది. బైక్‌ ర్యాలీ నిర్వహించి ఆదివాసీల్లో చైతన్యం తీసుకొచ్చారు. ఐటిడిఎ సాధనకు, ఆదివాసీ గ్రామాలను ఐదో షెడ్యూల్డ్‌లో చేర్చడానికి ఈ ర్యాలీ దోహదపడుతుందన్నారు. ఆదివాసీల హక్కుల కోసం పోరాడాలని, చట్టం అమలు చేయాలని, ఆదివాసీల సంక్షేమంపై పాలకుల నిర్లక్ష్య వైఖరి విడనాడాలని నినాదాలు చేశారు. ఐటిడిఎ లేకపోవడంతో ఆదివాసీలకు ఇబ్బందులు గురవుతున్నారని ఆవేదన చెందారు. ఆదివాసీలు ఎన్నో పోరాటాలతో, త్యాగాలతో ఐటిడిఎ వచ్చిందని, అలాంటి ఐటిడిశ్రీ జిల్లాకు లేకపోవడం విచారకరమని మాధవరావు తెలిపారు. కార్యక్రమంలో ముకుందాపురం, ఆంపురం సర్పంచ్‌లు భాస్కరరావు, జమ్మయ్య వార్డు మెంబర్‌ గౌరేసు, సవర శ్రీను, శంకర్‌, నూకయ్య, ఢిల్లీరావు, సురేష్‌, ఆదినారాయణ, అప్పారావు, గిరి, జానకిరామ్‌, ఈశ్వరరావు, అప్పన్న, యోగేశ్వరరావు, నిఖిల్‌, సుబ్బారావు పాల్గొన్నారు

.

➡️