ఎన్‌టిఆర్‌ అభిమానుల రక్తదానం

నందమూరి కుటుంబ అభిమాన సంఘాలు సంబరాలకే

శ్రీకాకుళం అర్బన్‌ : రక్తదానం చేస్తున్న అభిమానులు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

నందమూరి కుటుంబ అభిమాన సంఘాలు సంబరాలకే పరిమితం కాకుండా సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఆనందదాయకమని టిడిపి నాయకులు గొండు శంకర్‌ అన్నారు. జూనియర్‌ ఎన్‌టిఆర్‌ 41వ జన్మదినాన్ని పురష్కరించుకుని ఆదివారం జిల్లా ఎన్‌టిఆర్‌, మోక్షజ్ఞ సేవా సంఘం ఆధ్వర్యాన నగరంలోని డేఅండ్‌నైట్‌ కూడలిలో ఉన్న విజయశ్రీ బ్లడ్‌బ్యాంక్‌లో 41 మంది అభిమానులు రక్తదానం చేశారు. ఈ కార్యమ్రాన్ని ప్రారంబించిన శంకర్‌ మాట్లాడుతూ నందమూరి కుటుంబం నుంచి వచ్చిన మూడోతరం నటుడు జూనియర్‌ ఎన్‌టిఆర్‌ అని, ఆయన సినీ రంగంలో అనేక విజయాలు అందుకున్నారన్నారు. అబిమాóనులు సామాజిక బాధ్యతను గుర్తించుకుని సేవ చేయాలన్నారు.నగర టిడిపి అధ్యక్షులు మాదారపు వెంకటేష్‌, డేవిడ్‌, సురేంద్ర, సురేష్‌, ప్రసాద్‌, మోహన్‌, భాస్కర్‌, మహేష్‌, దుర్గా, రాజు, వెంకీ, బాసి, జనార్దన్‌, రాంకుమార్‌, వాసు పాల్గొన్నారు,

టెక్కలి రూరల్‌ : సినీ నటుడు జూనియర్‌ ఎన్‌టిఆర్‌ పుట్టినరోజు సందర్భంగా టెక్కలి ఎన్‌టిఆర్‌ అభిమానులు టీం ట్రస్ట్‌ ఆధ్వర్యంలో డాక్టర్‌ సునీత నేతృత్వంలో టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో ఎన్‌టిఆర్‌ అభిమానులు పాల్గొని 41 యూనిట్ల రక్తదానం చేశారని టీం తారక్‌ ట్రస్ట్‌ జిల్లా ప్రెసిడెంట్‌, టెక్కలి ఎన్‌టిఆర్‌ ఫ్యాన్స్‌ ప్రెసిడెంట్‌ దాలిశెట్టి భాస్కర్‌ తెలిపారు. కార్యక్రమంలో వెంకీ, కిరణ్‌, పవన్‌, లక్ష్మణ్‌, బాలకృష్ణ, ఢిల్లీ, అభిమానులు పాల్గొన్నారు.

 

➡️