రక్తదానం చేస్తున్న జెసి ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, డిఎస్‌పి వివేకానంద
- విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు
ప్రజాశక్తి – రణస్థలం రూరల్
రక్తదాతలు ప్రాణదాతలు అని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా మండలంలోని నడుకుదిటిపాలెంలో శ్రీమహాలక్ష్మి యూత్ క్లబ్, ఎన్‌ఇఆర్ స్కూల్ సంయుక్త ఆధ్వర్యాన బుధవారం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేవకు హద్దుల్లేవన్నారు. ప్రాణాపాయ స్థితిలో రక్తం ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకుని ప్రతిఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, డిఎస్‌పి వివేకానంద, జె.ఆర్ పురం ఎస్‌ఐ ఎస్.చిరంజీవి, లావేరు ఎస్‌ఐ లక్ష్మణరావు, ఇతర అధికారులు, అనధికారులు రక్తదానం చేశారు. మొత్తంగా 612 మంది రక్తదానం చేశారు. కార్యక్రమంలో ఎస్‌పి కె.వి మహేశ్వర రెడ్డి, డిఎంహెచ్‌ఒ బి.మీనాక్షి, రెడ్‌క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు, డిఆర్‌డిఎ పీడీ పి.కిరణ్ కుమార్, సిఐ అవతారాం, తహశీల్దార్ ఎన్.ప్రసాదరావు పాల్గొన్నారు.