రిజర్వాయర్‌లో మునిగి బాలుడు మృతి

మండలంలోని పారాపురం రిజర్వాయరులో

అభి మృతదేహం

ప్రజాశక్తి- కొత్తూరు

మండలంలోని పారాపురం రిజర్వాయరులో స్నానానికి వెళ్లిన చీమలవలస అభి (13) మంగళవారం మృతి చెందాడు. బూర్జ మండల కేంద్రానికి చెందిన శ్రీహరి భార్య జయమ్మ ఈనెల 13న ఓటు వేసేందుకు కన్నవారి ఊరు పారాపురం వచ్చింది. పిల్లలకు వేసవి సెలవులు కావడంతో రెండు రోజులు అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు. మంగళవారం సాయంత్రం తల్లీ కుమారుడు వాకింగ్‌కు వెళ్లారు. అనంతరం రిజర్వాయరులో స్నానానికి దిగారు. స్నానం చేస్తున్న సమయంలో అభి లోపలకు వెళ్లడంతో మునిగిపోయాడు. జయమ్మ రక్షించేందుకు ప్రయత్నించగా, అప్పటికే మునిగిపోయాడు. ఆమె కేకలు వేయడంతో స్థానికులు వచ్చి అభిని బయటకు తీశారు. 108లో కొత్తూరు సామాజిక ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధర్మాన కిషోర్‌కుమార్‌ ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుని తండ్రి శ్రీహరి లైన్‌మెన్‌గా పనిచేస్తున్నారు. మృతుడు ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. సెలవులకు గడిపేందుకని వచ్చి విగతజీవిగా మారడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

➡️