ప్రశంసాపత్రం అందుకుంటున్న అజరుకుమార్
ప్రజాశక్తి- ఎచ్చెర్ల
లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ (ఎల్‌ఐపి) అమలులో రాష్ట్రస్థాయిలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఉత్తమ ప్రతిభ కనపరిచిందని వర్సిటీ బోర్డు ఫర్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ఎడ్యుకేషన్ (బిసిడిఇ) సమన్వయకర్త డాక్టర్ బలగ అజరు కుమార్ అన్నారు. ఈ మేరకు విజయవాడలో రాష్ట్ర సమగ్ర శిక్షా అభియాన్‌లో గురువారం ‘యూనిసెప్-ఎల్‌ఐపి ప్రాణమిత్ర’పై కార్యశాలలో సన్మానించి ప్రశాంసాపత్రాన్ని అందజేశారు. డిగ్రీ కళాశాలల విద్యార్థుల్లో ఎల్‌ఐపిపై అవగాహన కల్పిస్తూ… పలు కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహణలో బిఆర్‌ఆర్‌లో ముందుంజులో ఉందన్నారు. ఈ మేరకు అజరుకుమార్‌ను విసి ఆచార్య కె.ఆర్.రజని, రిజిస్ట్రార్ ఆచార్య పి.సుజాతలు అభినందించారు.