ప్రమాణ స్వీకార సభకు బస్సులు

జనసేన పార్టీ అధ్యక్షులు, పిఠాపురం

జెండా ఊపి బస్సులను ప్రారంభిస్తున్న శ్రీధర్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

జనసేన పార్టీ అధ్యక్షులు, పిఠాపురం ఎమ్మెల్యే పవన్‌ కళ్యాణ్‌ ప్రమాణ స్వీకార సభకు వేసిన బస్సులను ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ దానేటి శ్రీధర్‌ మంగళవారం ప్రారంభించారు. శ్రీకాకుళం ఒకటో డిపో నుంచి బయలుదేరిన బస్సులకు జెండా ఊపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 21 అసెంబ్లీ, రెండు ఎంపీ స్థానాలతో జనసేన గెలుపు దేశ చరిత్రలోనే గొప్పదన్నారు. రాష్ట్రంలో వైసిపి విముక్తి నినాదంతో వెళ్లిన పవన్‌ను ప్రజలు ఆదరించారని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నో త్యాగాలు చేసిన పవన్‌ కళ్యాణ్‌ భవిష్యత్‌ తరాల నాయకుడు అని కొనియాడారు. రాష్ట్రంలో సుపరిపాలన అందించేందుకు ఎన్‌డిఎ కూటమితో భాగస్వామ్యం అయ్యారని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా పవన్‌ను ప్రశంసించారని గుర్తుచేశారు.

➡️