ప్రారంభిస్తున్న బాబూరావు
రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ బాబూరావు
ప్రజాశక్తి- పలాస
రైతులు పండించే ధాన్యాన్ని ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేస్తుందని రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ వజ్జ బాబూరావు అన్నారు. మండలంలోని లక్ష్మీపురంలో ఏర్పడి చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల కల్లాల వద్ద ధాన్యం కొనుగోలు చేసి వాహనంలో లోడ్ చేసి రైతులు కోరిన మిల్లుకు చేర్పిస్తామన్నారు. రైతులే వాహనం ఏర్పాటు చేసుకుని మిల్లులకు ధాన్యాన్ని చేర్చుకుంటే రవాణా ఖర్చులూ ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తుందన్నారు. గోనిసంచుకు రూ.6.17, హమాలి కూలి క్వింటాకు రూ.17.17లు ఇస్తుందన్నారు. రైతులు దళారులను నమ్మకుండా దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దువ్వాడ నాగావళి, మాజీ ఎంపిపి కృష్ణమూర్తినాయుడు, తహశీల్దార్ కళ్యాణ్‌చక్రవర్తి, లొడగల కామేష్, అధ్యక్ష, కార్యదర్శులు కుత్తమ్ లక్ష్మణ్, దువ్వాడ సంతోష్, రామన్నాయుడు, అగ్రికల్చర్ ఎడి మధు, ఎఒ పోలారావు, పిఎసిఎస్ సిఇఒ శ్రీనివాస్ పాల్గొన్నారు.