మాట్లాడుతున్న చైర్‌పర్సన్ రాజ్యలక్ష్మి
ప్రజాశక్తి- ఇచ్ఛాపురం
మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో రోడ్డు విషయంపై చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్త వ్యక్తి గత దూషణలకు దారితీసింది. ఒకరినొకరు ఏకవచనాలతో విమర్శలు చేసుకున్నారు. దీంతో కౌన్సిల్ హాల్ అంతా గందరగోళంగా మారింది. ముందుగా మున్సిపాలిటీ పరిధిలోని 16 వార్డులో ఉన్న పకీరుపేట రోడ్డు పనులు అర్ధాంతరంగా నిలిపి వేయడంపై వైస్ చైర్‌పర్సన్లు లాభాల స్వర్ణమణి, ఉల్లాల భారతీదివ్య అధికారులు తీరుపై మండిపడ్డారు. మున్సిపల్ చైర్‌పర్సన్ పిలక రాజ్యలక్ష్మి అధ్యక్షతన శనివారం కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే బెందాళం అశోక్ ఇచ్ఛాపురం పర్యటనలో భాగంగా ఈ ఆగస్టు 30న పకీరుపేటలో రూ.10 లక్షలతో సిసి రోడ్డు పనులకు భూమి పూజ చేయాల్సి ఉండగా, ఎందుకు వాయిదా వేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. వార్డు ప్రజలు రోడ్డు భూమి పూజ కోసం ఎదురు చూస్తుండగా, ఎవరికీ చెప్పకుండా వాయిదా వేయడం సరికాదన్నారు. ప్రజా ప్రతినిధులకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని నిలదీశారు. కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేశామని కమిషనర్ రమేష్‌కు మద్దతుగా చైర్‌పర్సన్ రాజ్యలక్ష్మి సమాధానం చెప్పారు. దీంతో వీరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అనంతరం మూడేళ్లుగా రోడ్డు కోసం పోరాడుతుంటే ఇప్పటికీ మోక్షం కలిగిందని, దీనినీ రాజకీయ కక్షతో రోడ్డు పనులు నిలిపి వేయటం దారుణమని అధికారుల తీరుపై మండిపడ్డారు. త్వరలోనే పనులు చేపడతామని చైర్‌పర్సన్ చెప్పటంతో గొడవ సర్దిమనిగింది. ఎజెండాలో పొందుపరిచిన పది అంశాలపై చర్చించారు. ఉన్నచోట కాలువల్లో షిల్ట్ తొలగించకుండా వేరేచోట తొలగించటంపై, అన్న క్యాంటిన్ పనులు నామినేషన్ పద్దతిలో పనులు చేయటంపై స్వర్ణమణి అభ్యంతరం వ్యక్త చేస్తూ వినతిపత్రం అందించారు. మున్సిపాల్టీలో పేరుకు పోయిన 400 కుక్కలను పట్టించి వ్యాక్సిన్ వేసేందుకు రూ.1500 చొప్పున రూ.6 లక్షలు కేటాయించి కౌన్సిల్ ఆమోదం తెలిపింది. కానీ, కౌన్సిల్ సభ్యుల్లో ఐదుగురిని కమిటీ వేయించి వారి పర్యవేక్షణలో కుక్కలను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలలని కోరారు. గతంలో కోతులు పట్టేందుకు నిదులు కేటాయించారని, కానీ, పూర్తి స్థాయిలో నివారించలేదన్నారు. బాహుదానది వద్ద శ్మశాన వాటికలో కాటికాపరిని నియమించాలని, అక్కడా లైట్లు, తాగునీటి సమస్య లేకుండా చేయాలని, పిచ్చి మొక్కలను తొలగించాలని టిడిపి కౌన్సిలర్ ఆశి లీలారాణి కోరారు. మున్సిపల్ స్టాండింగ్ వకీలుగా రాంబాబుఇచ్ఛాపురం మున్సిపల్ స్టాండింగ్ వకీలుగా న్యాయవాది ఎం.రాంబాబును మెజారిటీ వార్డు కౌన్సిలర్లు ఎన్నుకున్నారు. బార్ అసోసియేషన్ నుంచి ఐదుగురు న్యాయవాదులు అల్లాడ నారాయణరావు, నాగరాజుపాత్రో, జీరు కామేష్, అనపాన భైౖరాగిరెడ్డి, మొగల్లా రాంబాబులు దరఖాస్తులు చేసుకున్నారు. దీంతో చైర్‌పర్సన్, కమిషనర్, కౌన్సిలర్లు స్టాడింగ్ కౌన్సిల్ సభ్యుడుగా రాంబాబును ప్రకటించారు. ప్రశ్నిస్తున్న వైస్ చైర్‌పర్సన్లు స్వర్ణమణి, భారతీదివ్య