చలివేంద్రాలు ప్రారంభం

వేసవి కాలం దృష్ట్యా పురపాలక సంఘం, డైలీ మార్కెట్‌

కవిటి : చలివేంద్రం ప్రారంభిస్తున్న సర్పంచ్‌ శ్రీరామ్‌ప్రసాద్‌

ఇచ్ఛాపురం :

వేసవి కాలం దృష్ట్యా పురపాలక సంఘం, డైలీ మార్కెట్‌ ఆవరణలో చలివేంద్ర కేంద్రాలను కమిషనర్‌ నల్లి రమేష్‌ బుధవారం ప్రారంభించారు. రద్దీగా ఉండే ఈ రెండు ప్రాంతాల్లో తాగునీటికి ఇబ్బందులు లేకుండా చలివేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జి ఎఇ కామేశ్వరరావు, ఇన్‌ఛార్జి శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ఉపేంద్ర, అమినీటిస్‌ సెక్రటరీ పృధ్వీ, ఉద్యోగులు పాల్గొన్నారు. కవిటి: మండలంలోని బొరివంకలో యువత ఆధ్వర్యాన బుధవారం చలివేంద్రం ప్రారంభించారు. ఎంపిటిసి ఆర్థిక సహాయంతో పాదచారులకు మజ్జిగ పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ బెందాళం శ్రీరామ్‌ప్రసాద్‌, మాజీ సర్పంచ్‌ అంతర్యామి, ఎంపిటిసి మాజీ సభ్యులు బెందాళం విజరు కృష్ణ పాల్గొన్నారు.

 

➡️