ప్రజాశక్తి- సోంపేట
టిడిపి సీనియర్ నాయకులు, జెడ్‌పిటిసి మాజీ సభ్యులు, మత్స్యకార సామాజిక తరగతిలో పట్టుకున్న నాయకుడు సూరాడ మోహనరావు అని, ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని జిల్లా మత్స్యకార కో-ఆపరేటివ్ సొసైటీ మాజీ అధ్యక్షుడు మైలపిల్లి నరసింగరావు అధినాయకత్వానికి కోరారు. ఈ సందర్భంగా బుధవారం ‘ప్రజాశక్తి’తో మాట్లాడారు. టిడిపి విధానాలపై స్పష్టమైన అవగాహన ఉన్న వ్యక్తి అని కొనియాడారు. మండలంలోని ఎర్రముక్కాంకు చెందిన చంద్రమోహన్ ఎన్‌సిసి కంపెనీ ఆధ్వర్యాన 2017లో సోంపేట బీలభూముల్లో నిర్మించ తలపెట్టిన థర్మల్ ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకంగా తీరప్రాంత మత్స్యకార ఐక్యవేదిక స్థాపించి గ్రామాల్లో ఉద్యమస్ఫూర్తి కలిగించారని అన్నారు. ఈ ఉద్యమంలో సోంపేటకు చెందిన డాక్టర్ కృష్ణమూర్తి పర్యావరణ పరిరక్షణ సంఘం అధ్యక్షుడిగా ఉంటూ ప్లాంట్ నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రజల్లో గుర్తింపు పొందారని చెప్పారు. ఈయనతో పాటు ఎస్‌టి సాధన కమిటీ కన్వీనర్ చీకటి శ్రీరాములు, తీర ప్రాంత మత్స్యకార ఐక్యవేదిక అధ్యక్షుడు మాద సోమయ్య, ఆప్కాబ్ మాజీ డైరెక్టర్ మైలపల్లి త్రినాథరావు, జనసేన రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ బైపల్లి ఈశ్వరరావు ఉన్నారు.