చెత్త సేకరణతోనే గ్రామాల పరిశుభ్రత

గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజల

పరిశీలిస్తున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజల నుంచి తడి, పొడి చెత్తను సేకరించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అన్నారు. గ్రీన్‌ అంబాసిడర్స్‌ ఈ బాధ్యతను నిర్వర్తించేలా పంచాయతీ కార్యదర్శి, ఇఒపిఆర్‌డిలు పర్యవేక్షించాలని ఆదేశించారు. శ్రీకాకుళం రూరల్‌ మండలంలోని రాగోలులో గల చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎస్‌డబ్ల్యుపిసి కేంద్రంలో వసతులు, వర్మీ తయారీకి ఏర్పాటు చేసిన విట్స్‌ను పరిశీలించారు. ఇంకా ఎక్కువగా వర్మీ తయారీకి చర్యలు చేపట్టాలని పంచాయతీ కార్యదర్శి తిరుమలా దేవిని ఆదేశించారు. ఎస్‌డబ్ల్యుపిసి కేంద్రం సుందరీకరణకు సిఆర్‌ఎస్‌ ఫండ్‌ నుంచి రూ.లక్ష మంజూరు చేశారు. వర్మీ కంపోస్టు విక్రయించేందుకు కేంద్రం బయట స్టాల్‌ను నిర్మించాలని సర్పంచ్‌ గేదెల చెంగళరావుకు సూచించారు. కేంద్రం పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసి, సిబ్బంది మరింత బాధ్యతగా పనిచేసి సంపూర్ణ పారిశుధ్య గ్రామాలుగా తీర్చిదిద్దాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి కె.భారతీ సౌజన్య, ఎంపిడిఒ బొడ్డేపల్లి శైలజ, ఇఒపిఆర్‌డి, డిపిఆర్‌సి సిబ్బంది పాల్గొన్నారు.

 

➡️