ప్రమాద ఘటనా స్థలం పరిశీలన

మండలంలోని బురుమూరు వద్ద జాతీయ

సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న ఎస్‌పి మహేశ్వర రెడ్డి

ప్రజాశక్తి- లావేరు

మండలంలోని బురుమూరు వద్ద జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం సంభవించిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ప్రమాద స్థలాన్ని ఆదివారం ఎస్‌పి కె.వి.మహేశ్వర రెడ్డి క్షుణ్ణంగా పరిశీలించి, ప్రమాదానికి గల కారణాలు ఆరా తీశారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పోలీసు అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సురక్షిత ప్రయాణానికి వాహనదారులు రహదారి భద్రతా నిబంధనలు తుచ తప్పకుండా పాటించాలన్నారు. వాహనాలు నడిపే సమయంలో సురక్షితంగా, క్షేమంగా గమ్యాలను చేరుకోవాలని తెలిపారు. వాహనాలు అతివేగాన్ని నియంత్రించేందుకు రహదారి మార్గంలో ఇరువైపులా ప్రమాద సూచిక, పార్కింగ్‌ బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. హైవే పెట్రోలింగ్‌ సిబ్బంది నిరంతరం తిరుగుతూ ఇరువైపుల పార్కింగ్‌ ప్రదేశాల మినహా వాహనాలు పార్కింగ్‌ లేకుండా చూడాలన్నారు. ముఖ్య కూడళ్లలో సిసి కెమెరాలను ఏర్పాటు చేసి, ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈయనతో పాటు జె.ఆర్‌.పురం సర్కిల్‌ సిఐ ఎం.అవతారం, లావేరు ఎస్‌ఐ లక్ష్మణరావు ఉన్నారు.

 

➡️