పరిశీలిస్తున్న ఎస్‌పి మహేశ్వర రెడ్డి
ప్రజాశక్తి – ఎచ్చెర్ల
స్థానిక ఆర్మ్‌డ్ రిజర్వు పోలీసు మైదానంలో నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ సజావుగా సాగుతోంది. గురువారం నిర్వహించిన దేహ దారుఢ్య పరీక్షలకు 727 మంది అభ్యర్దులు హాజరు కావాల్సి ఉండగా, ఇందులో 478 మంది అభ్యర్థులు పాల్గొన్నారు. వారిలో 317 మంది పురుష అభ్యర్థులు అర్హత సాధించారు. అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన అనంతరం ఎత్తు, ఛాతి కొలత, 1600 మీటర్ల పరుగు, వంద మీటర్ల పరుగు, లాంగ్ జంప్ ఈవెంట్లను నిర్వహించారు.