సిపిఎస్‌ను రద్దు చేయాలి

కంట్రిబ్యూటరీ పెన్షన్‌

మాట్లాడుతున్న ఎమ్మెల్సీ రఘువర్మ

  • ఎమ్మెల్సీ పి.రఘువర్మ

ప్రజాశక్తి – శ్రీకాకుళం

కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సిపిఎస్‌)ను రద్దు చేయాలని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ డిమాండ్‌ చేశారు. స్థానిక ఎన్‌జిఒ హోంలో ఎపిటిఎఫ్‌ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్న పిఆర్‌సి కోసం వెంటనే కసరత్తు ప్రారంభించాలన్నారు. ఈలోగా మధ్యంతర భృతిపి ప్రకటించాలని కోరారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమానికి సమాంతరంగా తెలుగు మాధ్యమాన్ని పునరుద్ధరించాలన్నారు. ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసిన మూడు, నాలుగు, ఐదు తరగతులను తిరిగి పాత విధానంలోనే కొనసాగించాలని సూచించారు. ఇందుకు సంబంధించి జిఒ నంబరు 117ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎపిటిఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పల భానుమూర్తి మాట్లాడుతూ సిబిఎస్‌ఇ సిలబస్‌ను సిబిఎస్‌సి పాఠశాలలకు పరిమితం చేసి, మిగిలిన అన్ని పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వ సిలబస్‌ను ప్రవేశపెట్టాలన్నారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగించవద్దన్నారు. నూతన ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా వెంటనే మెగా డిఎస్‌సి ప్రకటించాలని, ప్రభుత్వ పాఠశాలల్లోని ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలతో సమన్వయ పరుచుకుని విద్య, ఉద్యోగ రంగాల సమస్యలను పరిష్కరించాలన్నారు. జిల్లా అధ్యక్షులు మజ్జి మదన్మోహన్‌ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ప్రధాన కార్యదర్శి ఎస్‌.వి అనిల్‌ కుమార్‌, ఉపాధ్యక్షులు పి.అప్పలనాయుడు, బి.ఢిల్లేశ్వరరావు, కె.గోపీకృష్ణ, ప్రత్యేక ఆహ్వానితులు బి.నేతాజీరావు తదితరులు పాల్గొన్నారు.

➡️