నైపుణ్యంతోనే సైబర్‌ నేరాల శోధన

సైబర్‌ మోసాలు

మాట్లాడుతున్న ఎస్‌పి మహేశ్వర రెడ్డి

ప్రజాశక్తి – శ్రీకాకుళం

సైబర్‌ మోసాలు అరికట్టేందుకు, కేసులు సులభతరంగా ఛేదించేందుకు సాంకేతిక నైపుణ్యం కీలకపాత్ర పోషిస్తుందని ఎస్‌పి కె.వి మహేశ్వర రెడ్డి అన్నారు. మండలంలోని గురజాడ విద్యాసంస్థలో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యాన పోలీసు అధికారులు, సిబ్బందికి సైబర్‌ నేరాల దర్యాప్తుపై శనివారం నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నైపుణ్యం అనేది నిరంతర ప్రక్రియ ద్వారా లభిస్తుందన్నారు. సైబర్‌ కేసులు ఛేదించడంలో ప్రతి అంశాన్నీ కీలకంగా తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం నేరాల తీరు మారుతోందని, ప్రతి నేరం సైబర్‌ క్రైమ్‌, సాంకేతికతతో ముడిపడి ఉంటుందన్నారు. ఈ నేరాలను చేధించేందుకు దర్యాప్తు అధికారులకు ప్రత్యేకమైన శిక్షణ, వృత్తి నైపుణం అవసరమన్నారు. సైబర్‌ నిపుణులు సాయి రామానుజ సైబర్‌ అంశాలపై వివరించారు. కార్యక్రమంలో డిఎస్‌పిలు సిహెచ్‌.వివేకానంద, రాజశేఖర్‌, గురజాడ కళాశాల ప్రిన్సిపాల్‌ ముకళీకృష్ణ, సిఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️