డిగ్రీ రెండో సెమిస్టర్‌ ఫలితాలు విడుదల

నగరంలోని స్వయం ప్రతిపత్తి

ఫలితాలు విడుదల చేస్తున్న ప్రిన్సిపాల్‌ సూర్యచంద్రరావు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

నగరంలోని స్వయం ప్రతిపత్తి గల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 2023-24 విద్యా సంవత్సరం మొదటి బ్యాచ్‌ రెండో సెమిస్టర్‌ ఫలితాలను ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.సూర్యచంద్రరావు, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ టి.ఆదిలక్ష్మి బుధవారం విడుదల చేశారు. ఈ ఫలితాల్లో బిఎలో 93 శాతం, బిఎస్‌సిలో 71.37 శాతం, బికాంలో 87.83 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులతో పాటు అధ్యాపకులను అభినందించారు. రానున్న రోజుల్లో ఫలితాల శాతాన్ని మరింత పెంపొందించే దిశగా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ పి.శంకరనారాయణ, అకడమిక్‌ కో-ఆర్డినేటర్‌ సిహెచ్‌.కృష్ణారావు, డిప్యూటీ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ పి.ఎస్‌ కనకదుర్గ, ప్రశాంతి, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ సిహెచ్‌.కాత్యాయని తదితరులు పాల్గొన్నారు.

➡️