అంగన్వా’ఢ’లుకనీస వేతనంపై అసెంబ్లీలో ప్రకటన చేయాలంటూ డిమాండ్‌

అంగన్వాడీలకు వేతనాలు పెంచుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

శ్రీకాకుళం అర్బన్‌ : కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న అంగన్వాడీలు

‘చలో విజయవాడ’ను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ధర్నాలు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

అంగన్వాడీలకు వేతనాలు పెంచుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసెంబ్లీలో ప్రకటన చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిహెచ్‌.అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు, ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు కె.కళ్యాణి డిమాండ్‌ చేశారు. అంగన్వాడీల చలో విజయవాడపై రాష్ట్ర ప్రభుత్వ నిర్భంధానికి నిరసనగా, 42 రోజుల సమ్మె మినిట్స్‌ అమలు చేయాలని కోరుతూ ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ సిఐటియు ఆధ్వర్యాన కలెక్టరేట్‌ వద్ద సోమవారం ధర్నా చేపట్టారు. ముందుగా నగరంలోని వాంబే కాలనీ కూడలి నుంచి కలెక్టరేట్‌ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చిన జిఒయే ఇచ్చి మోసం చేసిందన్నారు. గత ప్రభుత్వం రిటైర్మెంట్‌ వయసు 62 ఏళ్లకు పెంచుతూ జిఒ ఇచ్చారని తెలిపారు. శాంతియుతంగా చలో విజయవాడ చేపడితే గృహ నిర్బంధాలు, అరెస్టులు, బెదిరింపులకు పాల్పడటం దుర్మార్గమన్నారు. అంగన్వాడీలపై అధికారులతో తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి అడ్డంకులు సృష్టించిందన్నారు. ప్రజాస్వామికంగా వ్యవహరిస్తానని చెప్పిన చంద్రబాబు అందుకు విరుద్దంగా నిర్బంధాన్ని అమలు చేయడం సరికాదన్నారు. సమస్యలపై ఉమ ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఎన్నికలు ముందు అంగన్వాడీల 42 రోజులు సమ్మె సందర్భంగా టిడిపి నాయకులు సమ్మె శిబిరాలలో పాల్గొని మద్దతు తెలిపి మేం అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. కార్యకర్తలకు కనీస వేతనం రూ.26 వేలు నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ అమలు చేయాలన్నారు. మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మారుస్తూ జిఒ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ ధర్నాలో ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు కె.సుజాత, కె.హేమలత, కె.లక్ష్మి, మాధవి, చంద్రమౌళి, పి.భూలక్ష్మి, టి.రాజేశ్వరి, అప్పమ్మ, లలిత, ఇ.అప్పలనర్సమ్మ, కె.జ్యోతి పాల్గొన్నారు. టెక్కలి రూరల్‌ : టెక్కలి ఆర్‌డిఒ కార్యాలయం వద్ద చేపట్టిన ధర్నాలో యూనియన్‌ నాయకులు చింతాడ ఇందుమతి, హనుమంతు వాణిశ్రీ, బొడ్డేపల్లి రమణమ్మ, పద్మం, ప్రభావతి, శ్రీదేవి పాల్గొన్నారు. పలాస: ఆర్‌డిఒ కార్యాలయం వద్ద చేపట్టిన అంగన్వాడీ ధర్నాలో సిఐటియు నాయకులు ఎన్‌.గణపతి, అంగన్వాడీ యూనియన్‌ జిల్లా నాయకులు ఎన్‌.హైమావతి, బి.సునీత, యం.మం జులకుమారి, డి.సునీత, హేమలత, బి.నిర్మల, కె.జ్యోతి, బి.చామంతి, ఇందుమతి, జయలక్ష్మి, అప్పలనరసమ్మ, మాలతి, నాగేశ్వరి, భువనేశ్వరి, సరోజిని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్‌డిఒ వెంకటేష్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇచ్ఛాపురం : తహశీల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా తహశీల్దార్‌ శ్రీహరిని కలిసి వినతిపత్రం అందజేశారు.

 

➡️