మొక్కలను అందిస్తున్న ఎమ్మెల్యే అశోక్
ప్రజాశక్తి- ఇచ్ఛాపురం, కవిటి
ఉద్యానవన శాఖ, కొబ్బరి బోర్డు ద్వారా అందిస్తున్న కొబ్బరి మొక్కలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బెందాళం అశోక్ పిలుపునిచ్చారు. కవిటి మండలంలోని రాజపురంలో ఉద్యానాశాఖ ఆధ్వర్యాన కొబ్బరి పునరుద్ధరణ పథకం ద్వారా జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి దాసరి రాజుతో కలిసి బుధవారం మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ పథకం ఏటా ఉద్యానశాఖ, కొబ్బరి బోర్డు సహకారంతో పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఉద్యాన వనశాఖ అధికారి పి.మాధవీలత మాట్లాడుతూ కొబ్బరి మొక్కలను నాటు కొని తోట యజమాన్యం చేపట్టాలన్నారు. ఈ పథకం ద్వారా సుమారు 55 ఎకరాల్లో తోటలు వేశామన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు సీపాన వెంకటరమణ, మణి చంద్రప్రకాశ్, రమేష్, పొందల కృష్ణారావు, విస్తరణాధికారి బాలరాజు, లలిత, విష్ను, వర్థన్, గణపతి పాల్గొన్నారు.