జిల్లా జడ్జి జునైద్‌ అహ్మద్‌ మౌలానా

జిల్లా వ్యాప్తంగా

మార్చి 8న జాతీయ లోక్‌ అదాలత్‌

ప్రజాశక్తి- శ్రీకాకుళం

జిల్లా వ్యాప్తంగా వివిధ న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను రాజీ మార్గాన పరిష్కరించుకునేందుకు అత్యున్నత న్యాయస్థానం మార్చి 8న జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేసినట్టు జిల్లా జడ్జి జునైద్‌ అహ్మద్‌ మౌలానా వివరించారు. అందులో భాగంగా బుధవారం కోర్టు భవనంలో న్యాయమూర్తులతో, న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లోక్‌ అదాలత్‌లో ప్రజలు రాజీ పడదగ్గ సివిల్‌, క్రిమినల్‌ కేసులు రాజీ చేసుకోవడానికి చక్కటి అవకాశమన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకునేందుకు వీలుగా న్యాయవాదులు కక్షిదారులతో ఆలోచన చేయాలన్నారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్‌.సన్యాసినాయుడు, న్యాయవాదులు పాల్గొన్నారు.

➡️