ఉత్సాహంగా జిల్లాస్థాయి ఓపెన్‌ చెస్‌ టోర్నీ

క్రమం తప్పకుండా

విజేతలతో ఎసిబి సిఐ భాస్కర్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

క్రమం తప్పకుండా చదరంగం క్రీడను ప్రాక్టీస్‌ చేస్తూ నైపుణ్యం గల క్రీడాకారులుగా ఎదగాలని, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఎసిబి సిఐ కె.భాన్కర్‌ అన్నారు. నగరంలోని తిలక్‌నగర్‌ కాలనీలోని స్కూల్‌ ఆఫ్‌ చెన్‌ ఆకాడమీ ఆధ్యర్యాన జిల్లాస్థాయి ఓపెన్‌ చెస్‌ టోర్నమెంట్‌ను సోమవారం నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లోని చెస్‌ క్రీడాకారులు ఐదు రౌండ్ల పాటు నిర్వహించిన చెస్‌ పోటీల్లో ఆసక్తిగా పాల్గొన్నారు. తంగి సూర్య ఐదు విజయాలతో విజేతగా నిలవగా, రెండో స్థానంలో బలివాడ జయంత్‌, మూడో స్థానంలో ఎం.కళ్యాణ్‌ చక్రవర్తి నిలిచారు. అండర్‌-10 బాలబాలికల్లో కె.పార్థని, బి.పన్నిత, ఎస్‌.దివ్యేష్‌, కె.రోహన్‌ విజేతలుగా నిలిచారు. విజేతలకు ఎసిబి సిఐ భాస్కర్‌ మెడల్స్‌, మెరిట్‌ సర్టిఫికెట్లు, బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఫెడే రేటింగ్స్‌ చెస్‌ క్రీడాకారులు, స్కూల్‌ ఆఫ్‌ చెన్‌ ఆకాడమీ చెస్‌ కోచ్‌లు భేరి చిన్నారావు, కె.సాయి నిరంజన్‌సింగ్‌, చెస్‌ అభిమానులు పాల్గొన్నారు.

➡️