ఆహారాన్ని పరిశీలిస్తున్న కాంతారావు
- రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు బి.కాంతారావు
ప్రజాశక్తి – పాతపట్నం
విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు బి.కాంతారావు హెచ్చరించారు. మండలంలోని బూరగాంలో రేషన్ డిపో, ఎండియు వాహనం, అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. రికార్డుల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందజేస్తున్న మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూను సక్రమంగా అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ సనపల కిరణ్ కుమార్, సిఎస్‌డిటి ప్రసాదరావు, చక్రవర్తి, ఐసిడిఎస్, ఎంఇఒ తిరుమలరావు, తూనికలు కొలతల శాఖ అధికారులు పాల్గొన్నారు.