అధైర్యపడొద్దు.. అండగా ఉంటా

మండలంలోని పాతర్లపల్లిలో లావేరు మండల వైసిపి

మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే కిరణ్‌ కుమార్‌

ప్రజాశక్తి- రణస్థలం

మండలంలోని పాతర్లపల్లిలో లావేరు మండల వైసిపి నాయకులు, కార్యకర్తలతో ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌ కుమార్‌ ఆత్మీయ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సహకరించి ఓట్లు వేసిన ఎచ్చెర్ల నియోజకవర్గం ప్రజానీకానికి, వైసిపి నాయకులు, కార్యకర్తలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. వైసిపి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ఉండాలని, రానున్న రోజుల్లో కార్యకర్తలకు వారి కష్టసుఖాల్లో అన్ని విధాలుగా అండగా ఉంటానన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం సాగిద్దామని, అందరం సమిష్టిగా పని చేద్దామని, కార్యకర్తలు ఎవరు అధైర్య పడవద్దని, ఏ సమయంలోనైనా మీకు తోడుగా ఉంటానన్నారు. లావేరు ఎంపిపి ప్రతినిధి రొక్కం బాలకృష్ణ, జెడ్‌పిటిసి మీసాల సీతం నాయుడు, మండల పార్టీ అధ్యక్షులు దన్నాన రాజీనాయుడు, జెసిఎస్‌ ఇన్‌ఛార్జి మీసాల శ్రీనువాసరావు, వైస్‌ ఎంపిపి లుకలాపు శ్రీనువాసరావు, వైస్‌ ఎంపిపి ప్రతినిధి అలుపన నారాయణరెడ్డి, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి కంది నాని, జిల్లా వ్యవసాయ సలహామండలి సభ్యులు గొర్లె అప్పలనాయుడు పాల్గొన్నారు.

 

➡️