ధాన్యం కొనుగోళ్లపై నిర్లక్ష్యం వద్దు

రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసే విధానంలో

ఆన్‌లైన్‌లో పరిశీలిస్తున్న జెసి ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌

ప్రజాశక్తి- సరుబుజ్జిలి

రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసే విధానంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌ ఆదేశించారు. మండలంలోని చిగురువలస షళంత్రి, సింధువాడ పెద్దసవళాపురం గ్రామాల సచివాలయాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం పరిశీలించారు. అనంతరం సరుబుజ్జిలి లోని రామాంజనేయ రైస్‌ మిల్లులో తనిఖీలు నిర్వహించారు. ధాన్యం కొనుగోలు జరుగుతున్న తీరును మండల వ్యవసాయ అధికారి బి.పద్మనాభంను జెసి ప్రశ్నించారు. రైస్‌ మిల్లు నుంచి బ్యాంకు గ్యారంటీలు ఇంకా పూర్తి కాలేదని ఆయన బదులిచ్చారు. రైస్‌మిల్లు యజమానులు బ్యాంకుల అధికారులతో ఫోన్ల ద్వారా మాట్లాడి తక్షణమే బ్యాంకు గ్యారంటీలు పూర్తి చేయాలని జెసి ఆదేశించారు. అనంతరం జెసి మాట్లాడు తూ ధాన్యం కొనుగోలు విధానంలో ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, ఎటువంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని అధికా రులను హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు రైతు సేవా కేంద్రాల విధివిధానాలు ధాన్యం మద్దతు ధరలతో పాటు పలు అంశాలను జెసి రైతులను అడిగి తెలుసుకున్నారు. ఖరీఫ్‌ సాగుకు సంబంధించి రైతుల నుంచి ప్రతి ధాన్యపు గింజా కొనుగోలు చేసే విధంగా వ్యవసాయ శాఖ సిబ్బంది గ్రామ సచివాలయ సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని జెసి ఆదేశించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జెడి బి.రాజగోపాలరావు, తహశీల్దార్‌ ఎల్‌.మధుసూదన్‌, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

 

➡️