సందేహాలు నివృత్తి చేసుకోవాలి

న్నికల నిర్వహణలో

మాట్లాడుతున్న జిల్లా ఎన్నికల అధికారి మనజీర్‌ జిలానీ సమూన్‌

  • పొరపాట్లు ఉత్పన్నం కాకూదు
  • జిల్లా ఎన్నికల అధికారి మనజీర్‌ జిలానీ సమూన్‌

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

ఎన్నికల నిర్వహణలో ఆర్‌ఒలు, ఎఆర్‌ఒలు, సెక్టోరియల్‌ అధికారుల పాత్ర కీలకం, సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోని, ఎటువంటి పొరపాట్లు ఉత్పన్నం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ అన్నారు. నగరంలోని బి.ఆర్‌. అంబేద్కర్‌ కళావేదికలో ఆర్‌ఒలు, ఎఆర్‌ఒలు, సెక్టోరియల్‌ అధికారులకు శిక్షణా తరగతులను బుధవారం నిర్వహించారు. శిక్షణా కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి, జెజి ఎం.నవీన్‌ సంయుక్తంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో ఎన్నికలు విధులు నిర్వహించిన అనుభవం ఉన్నవారే అన్నారు. అయితే ఈ శిక్షణ ముఖ్య ఉద్దేశం మనకి తెలిసిన అంశాలను మరొక్కసారి నెమరు వేసుకోవడం ద్వారా మరింత మెరుగైన ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం నుంచి తీసుకోవడం, హోమ్‌ ఓటింగ్‌, ఇవిఎంల పనితీరు తదితర అంశాలపై శిక్షణా తరగతులు ఇస్తున్నామని అన్నారు. మనం చేసే పనిపై నమ్మకం కలిగినరోజు మనం శత శాతం విజయం సాధించగలమన్నారు. ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘం జారీ చేసిన కొత్త నిబంధనల ప్రకారం ఎన్నికలను నిర్వహించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని చెప్పారు. శిక్షణ పొందిన రోజు నుంచి పోలింగ్‌ పూర్తయ్యేవరకూ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు అన్ని అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఆర్‌ఒలు స్ట్రాంగ్‌ రూమ్‌ ఏర్పాట్లపై ముందస్తు పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. ఇవిఎం నోడల్‌ అధికారి, జిల్లా ఉపాధి అధికారి కె.సుధ ఇవిఎం, వివిపేట్‌ పనితీరు చేపట్టాల్సిన విధులకు సంబంధించి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా శిక్షణ ఇచ్చారు. అలాగే బ్యాలెట్‌ యూనిట్‌, ఇవిఎం, వివిపేట్‌ పనితీరు పేపర్‌ లోడింగ్‌, బ్యాటరీ ఇన్సట్‌ తదితర అంశాలను ప్రయోగాత్మకంగా వివరించా రు. శిక్షణా తరగతుల్లో డ్వామా పీడీ చిట్టిరాజు పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్‌ నిర్వహణ తదితర అంశాలపై వివరించారు. శిక్షణా కార్యక్రమా నికి జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు, టెక్కలి సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌, శ్రీకాకుళం, పలాస ఆర్‌డిఒలు సిహెచ్‌.రంగయ్య, భరత్‌కుమార్‌, జిల్లా స్థాయి మాస్టర్‌ ట్రైనీస్‌, మెప్మా పీడీ కిరణ్‌ కుమార్‌, బాలాజీనాయక్‌, కె.శేషగిరి, ఎన్నికల డిటిలు పాల్గొన్నారు.

➡️