సంక్షేమ పథకాల పునరుద్ధరణకు కృషి

ష్ట్రంలో ఎస్‌సి, ఎస్‌టిల

ఎమ్మెల్యేలను సన్మానిస్తున్న దళిత జెఎసి నాయకులు

  • ఎమ్మెల్యేలు మురళీమోహన్‌, జయకృష్ణ

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

రాష్ట్రంలో ఎస్‌సి, ఎస్‌టిల అభ్యున్నతికి గతంలో అమలు చేసిన సంక్షేమ పథకాలన్నింటినీ తిరిగి పునరుద్ధరించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని విజయనగరం జిల్లా రాజాం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్‌, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణలు హామీ ఇచ్చారు. నగరంలోని ఇలిసిపురం అంబేద్కర్‌ భవనంలో దళిత జెఎసి ఆధ్వర్యాన ఎస్‌సి, ఎస్‌టి ఉపాధ్యాయ సంఘం నాయకులు పోతల దుర్గారావు అధ్యక్షత గురువారం అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం రద్దు చేసిన ఎస్‌సి, ఎస్‌టి పథకాల్లో కొన్నింటిని ఇప్పటికే టిడిపి కూటమి పునరుద్ధరించిం దన్నారు. మిగిలిన వాటిని పూర్తి స్థాయిలో తిరిగి పనరుద్ధరించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా ఉన్నారన్నారు. ఎస్‌సిల్లో అనేక మంది ఇంకా వెనుకబాటుకు గురై ఉన్నారని, అందువల్ల మేధావులు, ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు నెలలో రెండు రోజులు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి నిరుద్యోగ యువతకు చైతన్యం కలిగించాలని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్రంలో యువతకు 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కృషి చేస్తుందన్నారు. వాటిలో ఎస్‌సి, ఎస్‌టిలకు 25 శాతం ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. జయకృష్ణ మాట్లాడుతూ ఆదివాసీల హక్కుల సాధనకు ఐక్యంగా ఉంటూ పోరాటాలు సాగించాలన్నారు. సంఘ ప్రతినిధుల కోరిక మేరకు త్వరలోనే తన సొంత నిధులతో సామాజిక భవనం నిర్మాణం చేపడతా నన్నారు. అనంతరం ఎమ్మెల్యేలను సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం కన్వీనర్‌ ఎన్‌.భరత్‌ భూషణ్‌ రాజు, విశ్రాంత ఆర్‌డిఒ పి.ఎం.జె.బాబు, విశ్రాంత ప్రిన్సిపాల్‌ ఎం.జ్యోతి ఫెడరిక్‌, దళిత మహాసభ అధ్యక్షులు బొకర నారాయణరావు, గంజి ఎజ్రా, కె.రామప్పడు, దళిత జెఎసి అధ్యక్షులు బత్తిన మోహన్‌, న్యాయవాది మురళీకృష్ణ పాల్గొన్నారు.

➡️