మాట్లాడుతున్న రామచంద్రరావు
ప్రజాశక్తి- రణస్థలం
జిల్లాలో పెన్షనర్ల సమస్యలు సత్వర పరిష్కారానికి జిల్లా పెన్షనర్ల సంఘం కృషి చేస్తుందని జిల్లా అధ్యక్షులు రామచంద్రరావు తెలిపారు. గురువారం రణస్థలంలో పెన్షనర్లతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. పెన్షనర్ల రికార్డులు సక్రమంగా ఉండాలని ఆయన అన్నారు. రిటైర్మెంట్ అయిన తర్వాత ఉద్యోగుల పెన్షనర్స్ పరిస్థితి వేరేగా ఉంటుందన్నారు. అలాగే పెన్షనర్ల సంఘం పటిష్టత ప్రతిఒక్కరూ శ్రద్ధ చూపాలన్నారు. రిటైర్డ్ సంఘం ప్రధాన కార్యదర్శి ధర్మారావు మాట్లాడుతూ పెన్షన్ విశ్రాంత ఉద్యోగుల ప్రాథమిక హక్కు అన్నారు. ఉద్యోగుల సేవలకు ప్రతిఫలంగా ప్రభుత్వం పెన్షన్ ఇస్తుందని, రిటైర్డ్ ఉద్యోగుల జీవన భృతి పెన్షన్ అని అన్నారు. జనవరి, ఫిబ్రవరి నెలలో మాత్రమే సబ్ ట్రెజరీకి లైఫ్ సర్టిఫికెట్లు ఇవ్వాలని, జీవన ప్రమాణంలో సబ్ ట్రెజరీలో పెన్షనర్ల పేర్లు ఉందో లేదో చూసుకోవాలన్నారు. పెన్షనర్ల సమస్యల సత్వర పరిష్కారానికి జిల్లా పెన్షనర్ల సంఘం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని, పెన్షనర్లు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పెన్షనర్ల సంఘం ప్రతినిధి మోహనరావు కోరారు. ఈ సమావేశంలో జిల్లా ప్రతినిధులతో పాటు రణస్థలం, లావేరు మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పున్నాన నరసింహులు నాయుడు, పాపినాయుడుతో పాటు సిహెచ్. గోపాలరావు, బాలి రామానాయుడు, మన్నే కృష్ణానందం, సత్యనారాయణ, లక్ష్మణరావు, ఎం.వి.రమణ తదితరులు పాల్గొన్నారు.