ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి

సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో ఆదర్శవంతమైందని

రామరాజు దంపతులను సన్మానిస్తున్న ఎమ్మెల్యే రవికుమార్‌

ప్రజాశక్తి- పొందూరు

సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో ఆదర్శవంతమైందని ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అన్నారు. బుధవారం తహశీల్దార్‌ కార్యాలయ ఆవరణలో ఎంఇఒ-1 పి.వి.రామరాజు ఉద్యోగ విరమణ ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో విద్యాభివృద్దికి ఎంఇఒ రామరాజు ఎనలేని కృషి చేశారన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు సానుకూలంగా ఉందన్నారు. గత ప్రభుత్వంలో కొంతమంది ఉన్నతాధికారుల వలన ఉపాధ్యాయులు వేధింపులకు గురయ్యారని, ఈ ప్రభుత్వంలో అటువంటి పరిస్థితి ఉండదని పేర్కొన్నారు. అనంతరం పలు ఉపాధ్యాయ సంఘాలు ఎమ్మెల్యేను దుశ్శాలువతో సన్మానించారు. కార్యక్రమంలో ఎంపిపి కిల్లి ఉషారాణి, డిప్యూటీ డిఇఒ ఆర్‌.విజయకుమారి, ఎంఇఒ సంఘం అధ్యక్షులు కారు పున్నయ్య, ఎంపిడిఒ సీపాన హరిహరరావు, ఎంఇఒ-1 రాజేంద్రప్రసాద్‌, ఎంఇఒ-2 పట్నాన రాజారావు, ఉపాధ్యాయ సంఘం నాయకులు మధన్‌ మోహన్‌, హరిప్రసన్న, పి.అప్పారావు, రమణరావు తదితరులు పాల్గొన్నారు.

 

➡️