వేసవి వినోదం ముగింపు

నగరంలోని పెద్ద రెల్లివీధి

మాట్లాడుతున్న గిరిధర్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

నగరంలోని పెద్ద రెల్లివీధి మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాలలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యాన నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న వేసవి వినోదం కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. ఈ సందర్భంగా జెవివి రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్‌ మాట్లాడుతూ విద్య, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, స్వావలంబన కోసం జనవిజ్ఞాన వేదిక పనిచేస్తోందన్నారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించి మూఢ నమ్మకాలకు దూరం చేసేందుకు నిరంతరాయంగా కృషి చేస్తోందన్నారు. జన విజ్ఞాన వేదికలో అన్నిరంగాల ప్రముఖులు, మేధావులు పనిచేస్తున్నారని చెప్పారు. జెవివి జిల్లా అధ్యక్షులు కుప్పిలి కామేశ్వరరావు మాట్లాడుతూ జెవివి ఆశయాలను విద్యార్థులు సమాజంలోకి తీసుకెళ్లాలన్నారు. వేసవి వినోదంలో భాగంగా చిన్నారులకు పాటలు, పద్యాలు, మేజిక్‌, డ్రాయింగ్‌, పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో జెవివి జిల్లా కోశాధికారి వి.ఎస్‌ కుమార్‌, పెన్షనర్ల సంఘం జిల్లా నాయకులు ఎం.ఆదినారాయణ మూర్తి, జిల్లా ఉపాధ్యక్షులు సామ సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.

➡️