పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి

బూర్జ : ర్యాలీ నిర్వహిస్తున్న అధికారులు, మహిళా సంఘాలు

ప్రజాశక్తి- బూర్జ

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యతని, ప్రతిఒక్కరు తమ బాధ్యతలను చక్కగా నెరవేర్చాలని మార్క్ఫెడ్‌ రాష్ట్ర డైరెక్టర్‌ అనెపు రామకృష్ణ నాయుడు అన్నారు. బుధవారం మండల కేంద్రంలో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతిఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించాలన్నారు. అంతకు ముందు ర్యాలీ నిర్వహి ంచి ప్రజలకు అవగాహన కల్పించేందుకు మహిళలు ఫ్లకార్డు లు ప్రదర్శించారు. ఎంపిడిఒ తిరుపతిరావు, ఇఒపి ఆర్‌డి విజయలక్ష్మి, ఎపిఒ రాజ్‌కుమార్‌, కార్యదర్శులు పాల్గొన్నారు. పొందూరు: మొక్కలతోనే మానవ మనుగడ సాధ్యమని ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అన్నారు. మేజర్‌ పంచాయతీలో స్వచ్చతా హీ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో పలుచోట్ల మొక్కలు నాటారు. అనంతరం పారిశుధ్య కార్మికులకు యూనీఫాం, చేతి గ్లౌజులు, మాస్కులు అందజేశారు. కార్యక్రమంలో మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌ ఆర్‌.లక్ష్మి, ఎంపిడిఒ సీపాన హరిహరరావు, ఎంపిటిసి-1, 2 ప్రతినిధులు అనకాపల్లి శ్రీరంగ నాయకులు, బాడాన శేషగిరి, మాజీ సర్పంచ్‌ విజయలక్ష్మి పాల్గొన్నారు.ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం మెజిస్ట్రేట్‌ పరేష్‌కుమార్‌ ఆధ్వర్యాన కోర్టు ఆవరణలో బుధవారం స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిసరాలను పరిశుభంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉంటార న్నారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ఎన్‌.రమణయ్య రెడ్డి, న్యాయవాదులు ఆర్‌.దేవరాజ్‌రెడ్డి, డి.కృష్ణమూర్తిరెడ్డి, నాగరాజ్‌పాత్రో, పి.ప్రహల్లాదరెడ్డి, ఎ.భైరాగిరెడ్డి, మనోజ ్‌కుమార్‌ సామంతో, భగవాన్‌ దాస్‌, మురళి పాల్గొన్నారు.

 

➡️