మాట్లాడుతున్న సన్యాసినాయుడు
ప్రజాశక్తి – శ్రీకాకుళం
మధ్యవర్తిత్వం వల్ల త్వరితగతిన కేసుల పరిష్కారానికి అవకాశం ఉంటుందని మూడో అదనపు జిల్లా జడ్జి సిహెచ్.వివేక్ ఆనంద్ శ్రీనివాస్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు అన్నారు. స్థానిక జిల్లా బార్ అసోసియేషన్ హాల్‌లో మధ్యవర్తిత్వంపై న్యాయ అవగాహనా సదస్సును బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరు పార్టీలూ మధ్యవర్తిత్వం ద్వారా వారి సమయం, కోర్టు కాలాన్ని వృథా కాకుండా ఉంటుందన్నారు. వాహన ప్రమాదాల్లో బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలన్నారు. సదస్సులో బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కె.ఈశ్వరరావు, కార్యదర్శి కె.అన్నంనాయుడు, న్యాయవాదులు పాల్గొన్నారు.