పరిశీలిస్తున్న ఎస్‌పి మహేశ్వర రెడ్డి
ఎస్‌పి కె.వి మహేశ్వర రెడ్డి
ప్రజాశక్తి – శ్రీకాకుళం
వాహన తనిఖీలను విస్తృతంగా చేపట్టాలని ఎస్‌పి కె.వి మహేశ్వర రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. నగరంలోని డే అండ్ నైట్, రామలక్షణ, ఏడు రోడ్లు, అరసవల్లి మిల్లు జంక్షన్‌ను గురువారం పరిశీలించారు. నగరంలోని ట్రాఫిక్ రద్దీ, సమస్యలపై ఆరా తీశారు. వాహనాల రాకపోకలు, పార్కింగ్, ట్రాఫిక్ సమస్యలకు గల కారణాలను పరిశీలించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది నిర్వహిస్తున్న వాహన తనిఖీల సరళిని పరిశీలించి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలను నడిపే వారిని, మైనర్ డ్రైవింగ్, లైసెన్స్ లేని వారిని గుర్తించి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలు పాటించని వారిపై చట్టపరమైన జరిమానాలు విధించాలన్నారు. ప్రమాదాల నివారణ చర్యలు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం శ్రీకాకుళం రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. పలు ముఖ్యమైన రికార్డుల నిర్వహణను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులపై మర్యాదపూర్వకంగా వ్యవహరించి వారి సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఆయన వెంట రూరల్ సిఐ పైడిపు నాయడు, ట్రాఫిక్ సిఐ నాగరాజు, ఎస్‌ఐలు హరికృష్ణ, సంతోష్ ఉన్నారు.