‘చెకుముకి’ని విజయవంతం చేయాలి

జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యాన నిర్వహించనున్న

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న డిఇఒ తిరుమలచైతన్య

డిఇఒ తిరుమల చైతన్య

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యాన నిర్వహించనున్న చెకుముకి సైన్స్‌ సంబరాలను విజయవతం చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్‌.తిరుమల చైతన్య పిలుపునిచ్చారు. డిఇఒ కార్యాలయంలో చెకుముకి సైన్స్‌ సంబరాల పోస్టర్‌ను శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ సంబరాలు జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మున్సిపల్‌, ట్రైబల్‌ వెల్ఫేర్‌, మోడల్‌ స్కూళ్లు, కెజిబివి, ఎయిడెడ్‌, ప్రయివేట్‌ విద్యాలయాల ప్రిన్సిపాళ్లు, హెచ్‌ఎంలు, ఎంఇఒలు సహకరించి విజయవంతం చేయాలన్నారు. జెవివి రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్‌ మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో సెప్టెంబరు 25న, మండలస్థాయిలో అక్టోబరు ఒకటిన, జిల్లాస్థాయిలో అక్టోబరు 27న, రాష్ట్రస్థాయిలో నవంబరు 9, 10 తేదీల్లో చెకుముకి సైన్స్‌ సంబరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వాటిలో అన్ని పాఠశాలల్లోని 8, 9, 10 తరగతుల విద్యార్థులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్‌ కమిషనర్‌ లియాఖత్‌ ఆలీఖాన్‌, హెడ్‌ మాస్టర్ల అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు వి.సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి యర్నాగుల వాసుదేవరావు, ఎపిటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు బి.వెంకటేశ్వర్లు, మ్యాథ్స్‌ ఫోరం జిల్లా అధ్యక్షులు కందుల అశోక్‌, జీవశాస్త్ర ఉపాధ్యాయ ఫోరం అధ్యక్షులు పుట్టా ఉదరుకుమార్‌, ప్రధాన కార్యదర్శి పూజారి గోవిందరావు, మండల విద్యాశాఖాధికారులు పేడాడ దాలినాయుడు, రామకృష్ణ, త్రినాథరావు, మజ్జి మురళీకృష్ణ పాల్గొన్నారు.

 

➡️