గాంధీ మార్గం అనుసరణీయం

అహింసే ఆయుధంగా

గాంధీ విగ్రహానికి నివాళ్లర్పిస్తున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

  • కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

అహింసే ఆయుధంగా దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహానీయుడు మహాత్మా గాంధీ అని, ఆయన మార్గం అనుసరణీయమని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్‌లోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి బుధవారం నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుపరిపాలన ద్వారా గ్రామ స్వరాజ్య స్థాపనే లక్ష్యంగా గాంధీ కలలు కన్నారని గుర్తుచేశారు. ఆయన ఆశయ సాధనలో ప్రతిఒక్కరూ దేశం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. లాల్‌ బహదూర్‌ శాస్త్రి రైతులకు అందించిన సేవలను గుర్తుచేశారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, కలెక్టరేట్‌ ఎఒ సూర్యనారాయణ, సి-సెక్షన్‌ సూపరింటెండెంట్‌ ప్రకాష్‌, సరోజని, రాజేశ్వరరావు, శ్రీనివాసరావు, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

➡️