నేటి నుంచి గోకులాలు ప్రారంభం

జిల్లాలో నిర్మాణం పూర్తయిన గోకులాలను

మాట్లాడుతున్న జెడి రాజగోపాలరావు

పశుసంవర్థకశాఖ జెడి కె.రాజగోపాలరావు

ప్రజాశక్తి – రణస్థలం

జిల్లాలో నిర్మాణం పూర్తయిన గోకులాలను శుక్రవారం నుంచి మూడు రోజుల్లో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసినట్లు పశుసంవర్థక శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ కె.రాజగోపాలరావు తెలిపారు. పశుసంవర్థకశాఖ ఎడి కార్యాలయానికి శుక్రవారం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 1489 గోకులాలు మంజూరయ్యాయని, వీటిలో 602 పూర్తయ్యాయని తెలిపారు. మరో 76 మంజూరు చేయాల్సి ఉందని, మంజూరు చేసిన మిగిలిన పనులు చురుగ్గా సాగుతున్నాయని చెప్పారు. పూర్తయిన గోకులాలు ఆయా మండలాల్లో ప్రజాప్రతినిధులతో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. నిర్మాణంలో ఉన్న వాటిని ఫిబ్రవరి నెలాఖరుకల్లా పూర్తి చేసి, వాటినీ ప్రారంభించేందుకు చర్యలు చేపడతామన్నారు. గ్రామాల్లో వ్యవసాయానికి అనుబంధంగా రైతులు పశు పోషణపై ఆధారపడి జీవనం సాగిస్తుంటారని, అలాంటి వారికి అండగా ఉండేందుకు ప్రభుత్వం గోకులాల పేరిట షెడ్లు నిర్మిస్తోందని తెలిపారు. దీన్ని పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆయన వెంట పశుసంవర్థకశాఖ ఎడి డాక్టర్‌ బి.దుర్గారావు, డాక్టర్‌ ఎ.రామ్‌కుమార్‌, ఇతర సిబ్బంది ఉన్నారు.

 

➡️