గోకులాలతో రైతుకు మేలు

కూటమి ప్రభుత్వం

బూర్జ : మాట్లాడుతున్న ఎమ్మెల్యే రవికుమార్‌

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాడి రైతుల సంక్షేమానికి చర్యలు చేపట్టిందని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. గార మండలం శ్రీకూర్మం పంచాయతీ అయ్యవారిపేటలో ఉపాధి హామీ నిధులతో నిర్మించిన మినీగోకులం షెడ్‌ను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో పశుపోషణ, కోళ్లు, గొర్రెలు, మేకలు పెంపకానికి మెరుగైన వసతి కల్పిస్తూ, పెంపకందార్లను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. పశువుల నివాసానికి కొద్దిపాటి స్థలం ఉంటే మినీగోకులం పేరిట షెడ్లు నిర్మించేందుకు శ్రీకారం చుట్టిందన్నారు. 90 శాతం సబ్సిటీతో ప్రభుత్వం అందించే ఈ పథకాన్ని పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పశుసంవర్థకశాఖ అధికారులు, నాయకులు పాల్గొన్నారు. బూర్జ : పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అన్నారు. మండలంలోని డొంకలపర్తలో గోకులాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో మహిళలు తాగునీటి సౌకర్యం లేదని, అవస్థలు పడుతున్నామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఆరు నెలల్లో ఇంటింటికీ తాగునీటి కుళాయిలను ఏర్పాటు చేస్తామని, గ్రామంలో వాటర్‌ ట్యాంకు నిర్మిస్తామని హామీనిచ్చారు. పాలకొండ సిఎస్‌పి రోడ్డు నుంచి గ్రామానికి వెళ్లే రోడ్డులో విద్యుత్‌ స్తంభాలకు లైట్లు వేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. అనంతరం సౌత్‌ జోన్‌ స్విమ్మింగ్‌ లో జాతీయ క్రీడల్లో సాధించిన బలగ స్వామినాయుడును సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్‌, గిడ్డంగుల సంస్థ డైరెక్టర్‌ రామకృష్ణ, టిడిపి మండల అధ్యక్షులు వావిలపల్లి సీతారాం బాబునాయుడు, తూర్పు కాపు ఉపాధ్యక్షులు కె.జయరామ్‌, లంక జగన్నాథం, ఎఎంసి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, కార్యదర్శుల సంఘం అధ్యక్షులు మురళీకృష్ణ పాల్గొన్నారు.

➡️