నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట

ఏ కోర్సు చదివినా, అందులో

మాట్లాడుతున్న జెడ్‌పి సిఇఒ శ్రీధర్‌ రాజు

  • జెడ్‌పి సిఇఒ శ్రీధర్‌ రాజు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

ఏ కోర్సు చదివినా, అందులో నైపుణ్యత కలిగి ఉన్న వారికే ఉద్యోగావకాశాలు దక్కించుకోగలరని జెడ్‌పి సిఇఒ శ్రీధర్‌ రాజు అన్నారు. యువతకు అన్ని రంగాల్లో నైపుణ్యం పెంచడానికి శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైందని తెలిపారు. నైపుణ్య గణన జిల్లాస్థాయి శిక్షణా కార్యక్రమాన్ని డిఆర్‌డిఎ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఆటోమేషన్‌, కృత్రిమ మేధ ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషించనున్నాయన్నారు. అందువల్లే ప్రభుత్వం నైపుణ్య గణన చేపట్టి, వాటి ఆధారంగా యువతకు శిక్షణ ఇవ్వాలని భావిస్తోందన్నారు. గణన పారదర్శకంగా నిర్వహించి వివరాలను నైపుణ్య యాప్‌లో నమోదు చేయాలన్నారు. జిల్లాస్థాయిలో శిక్షణ తీసుకున్న వారు మున్సిపాల్టీలు, గ్రామస్థాయి సిబ్బందికి శిక్షణ ఇవ్వాలన్నారు. నవంబరు మొదటి వారంలో నైపుణ్య గణనను ప్రారంభించనున్నట్లు తెలిపారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి సాయికుమార్‌ మాట్లాడుతూ భవిష్యత్‌లో రాగల మార్పులకు అనుగుణంగా యువత కూడా తమ నైపుణ్యాలను పెంచుకోవాలన్నారు. అనంతరం మాస్టర్‌ ట్రైనర్‌ ధర్మేంద్ర పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా శిక్షణ ఇచ్చారు. శిక్షణలో గ్రామ, వార్డు సచివాలయాల జిల్లా కోఆర్డినేటర్‌ ఉదరు, జూనియర్‌ ఎంప్లాయిమెంట్‌ అధికారి రవీంద్ర, మాస్టర్‌ ట్రైనర్‌ ధర్మేంద్ర, ఎపిఎస్‌ఎస్‌డిసి సిబ్బంది పాల్గొన్నారు.

➡️