సెల్‌ఫోన్లు అప్పగింత

రైలులో చోరీకి గురైన సెల్‌ఫోన్లను పోలీసులు రికవరీ చేసి బాధితులకు

బాధితులకు సెల్‌ఫోన్లు అందజేస్తున్న ఎస్‌ఐ షరీఫ్‌

ప్రజాశక్తి- పలాస

రైలులో చోరీకి గురైన సెల్‌ఫోన్లను పోలీసులు రికవరీ చేసి బాధితులకు శనివారం అప్పగించారు. ఈ సందర్భంగా పలాస రైల్వేస్టేషన్‌ జిఆర్‌పి పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ షరీఫ్‌ శనివారం విలేకరులతో మాట్లాడారు. రైలు ప్రయాణికులు మొత్తం 18 మంది తమ సెల్‌ఫోన్లు చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేశారని తెలిపారు. తమ సిబ్బంది నిరంతరం నిఘా పెట్టి దొంగలను పట్టుకుని వారి వద్ద నుంచి సెల్‌పోన్ల రికవరీ చేశామన్నారు. ఈ మేరకు బాధితులకు వాటిని అప్పగించామన్నారు. రూ.5.04 లక్షలు విలువ చేసే సెల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. రైలులో మొబైల్స్‌ చోరీ జరిగితే సంబంధిత ఇఎంఐ నంబరుతో సహా తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో పోలీసులు హెచ్‌సి కోదండరావు, ఎం.సంతోష్‌కుమార్‌, పి.రమేష్‌, దేవేంద్రనాథ్‌. టి.తేజ, లోకనాథం పాల్గొన్నారు.

 

➡️