అచ్చెన్నాయుడు
ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్, కోటబొమ్మాళి
జిల్లా ప్రజలకు పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు వేర్వేరు ప్రకటనల్లో దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి పండుగ అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలని, కష్టాలనే చీకట్లు తొలగి వెలుగులు నిండిపోవాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆకాంక్షించారు. చెడుపై మంచి చేసే యుద్ధం ఎప్పుడూ సఫలీకృతం అవుతుందని చాటే ఈ పండగ వేళ కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీని నిలబెట్టుకుంటోందని తెలిపారు. ఈ పండుగ వేళ ప్రతి ఇంటా ఆనంద కాంతులు నింపాలన్న ధ్యేయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని జిల్లా నుంచే ప్రారంభిస్తున్నారని పేర్కొన్నారు. పర్యావరణ అనుకూల దీపావళిని ప్రతిఒక్కరూ చేసుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కోరారు. ప్రకృతి మనుగడకు విఘాతం కలిగించే విధంగా పండగ చేసుకోవడం అంటే సంస్కృతికి మరింత ప్రాధాన్యం ఇచ్చిన వారమవుతామని పేర్కొన్నారు. తగు జాగ్రత్తలు పాటించి దీపావళి పండగ చేసుకోవాలని ఎస్‌పి కె.వి మహేశ్వర రెడ్డి ఒక ప్రకటనలో కోరారు. అందరి జీవితాల్లో దీపావళి వెలుగులు నిండాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.