అంగన్వాడీల గృహ నిర్బంధం

సుదీర్ఘ కాలంగా చిన్నారులకు, బాలింతలకు, గర్భవుతులకు సేవలందిస్తున్న

‘చలో విజయవాడ’ను అడ్డుకునేందుకు యత్నం

నాయకులు, కార్యకర్తల ఇళ్ల వద్ద పోలీసులు

కొన్నిచోట్ల నోటీసులు అందజేత

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

సుదీర్ఘ కాలంగా చిన్నారులకు, బాలింతలకు, గర్భవుతులకు సేవలందిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలను, సహాయకులను క్రమబద్ధీకరణ, గ్రాట్యుటీ కోరుతూ అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యాన సోమవారం చలో విజయవాడకు పిలుపునిచ్చారు. దీనిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నగరంలోని కార్యకర్తల ఇళ్ల వద్ద గడచిన 24 గంటల వ్యవధిలో పోలీసుల కాపలా ఉండి వారి రాకపోకలను నిశితంగా పరిశీలించి గృహ నిర్బంధించారు. నాయకులకు విజయవాడ ధర్నా కార్యక్రమానికి వెళ్లొద్దంటూ పోలీసులు నోటీసులు అందజేశారు. పోలీసు ఆంక్షలు ఉండబోవని, ప్రజాస్వామ్య యుతంగా పాలన సాగుతుందని ఎన్నికలకు ముందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన మాటలకు భిన్నంగా ఇప్పుడు ఆంక్షల పాలన కొనసాగిస్తున్నారన్న భావన ప్రజల్లో వ్యక్త మవుతోంది. అంగన్వాడీ కేంద్రాల్లో కొన్నేళ్లుగా కార్యకర్తలు, సహాయకులు పనిచేస్తున్నారు. నిర్వహణలో భాగంగా సాక్షమ్‌ అంగన్వాడీ, పోషణ్‌ 2.0 స్కీంలకు 50 ఏళ్లు పూర్తయింది. అయినా, కార్యకర్తలకు కనీస వేతనాలు అందడం లేదు. రూ.26 వేలు కనీస వేతనాన్ని చెల్లించాలని గడచిన కొన్నేళ్లుగా అంగన్వాడీలు ఉద్యమిస్తున్నారు. అంగన్వాడీ వర్కర్లను, హెల్పర్లను వరుసగా గ్రేడ్‌-3, గ్రేడ్‌-4 ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీనికి తోడు సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి 7వ పే కమిషన్‌ సిఫార్సులకు అనుగుణంగా కనీస వేతనం నెలకు రూ.26 వేలకు పెంచి రెగ్యులైజేషన్‌ చేయాలని కోరుతున్నారు. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు అందరికీ వడ్డీతో సహా గ్రాట్యుటీ చెల్లించాలని, రాజ్యాంగ ప్రాథమిక హక్కుగా ఉన్న ఆరేళ్ల లోపు వయసు కలిగిన పిల్లలందరికీ శిశుసంరక్షణ, విద్య, అభివృద్ధిని కట్టుదిట్టంగా అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరిపడా నిధులను బడ్జెట్లో కేటాయించాలని కోరుతున్నారు. దీనికి తోడు మినీ కేంద్రాల పేరుతో తక్కువ వేతనాలు చెల్లించి కార్యకర్తలతో పాటు సహాయకుల విధులను ఒక్కరి చేత చేయిస్తున్నారు. విద్యార్హత ఉన్నా ఏళ్ల తరబడి సూపర్‌ వైజరు ఉద్యోగోన్నతులు కల్పించకుండా జాప్యం జరుగుతోంది. దీంతో విద్యార్హతలు ఉన్న అంగన్వాడీలు కార్యకర్తలుగానే ఉద్యోగ విరమణ చేయాల్సి వస్తోంది. దీనికితోడు సహాయకుల్లో అర్హతలు ఉన్నా వారికి కార్యకర్తలుగా ఉద్యోగోన్నతి కల్పించాలని గడచిన కొన్నేళ్లుగా డిమాండ్‌ చేస్తున్నారు. ఉద్యోగోన్నతులు ఇవ్వాలని కోరుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. దీనికి తోడు గత ప్రభుత్వ హయాంలో సుదీర్ఘ కాలం సమ్మె చేసిన తర్వాత చర్చలకు ఆహ్వానించి యూనియన్‌తో పలు ఒప్పందాలు చేసింది. కానీ, ఇంతవరకు వాటికి జిఒలు ఇవ్వలేదు. సమస్యలు పరిష్కరిస్తూ తక్షణమే జిఒలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు అంగన్వాడీ కేంద్రాల్లో సదుపాయాల కొరత వేధిస్తోంది. శిథిలమైన గదులు, అద్దె భవనాలు, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం లేకపోవడంతో చిన్నారులకు, బాలింతలకు, గర్భిణులకు కష్టాలు తప్పడం లేదు. వేసవి సీజన్‌ మొదలు కావడంతో ఉక్క పోత తీవ్రమవుతోంది. సొంత భవనాల కోసం ఎన్నోఏళ్లుగా కోరుతున్నా నిర్మాణాలు చేపట్టడం లేదు. కొన్ని చోట్ల భవనాలు మంజూరు చేసినా వాటిని అసంపూర్తిగా వదిలేయడం వల్ల అద్దె భవనాల్లోనే కేంద్రాలను నిర్వహించాల్సి వస్తోంది. వీటిని సకాలంలో అద్దెలు చెల్లించడం లేదు. అలాగే పెరిగిన ధరలకు అనుగణంగా మెనూ ఛార్జీలు పెంచాల్సి ఉన్నా… పట్టించుకునే వారులేరు. పౌష్టికాహారం అందిస్తున్నామని చెబుతూనే… వాటికి తగినంత బడ్జెట్‌ కేటాయింపులు చేపట్టడం లేదు. దీంతో నెలల తరబడి బిల్లులు పెండింగ్‌లో ఉంటున్నాయి. మరోవైపు వంట గ్యాస్‌ ప్రభుత్వమే ఇవ్వాలని ఎన్నో ఏళ్లుగా అంగన్వాడీలు కోరుతున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది. ఫ్రీ స్కూళ్ల ఏర్పాటుతో పిల్లలు రోజంతా కేంద్రాల్లో ఉండేందుకు అనువైన పరిస్థితులు కల్పించేందుకు మౌలిక వసతులు ప్రభుత్వమే సమకూర్చాలని వారు కోరుతున్నారు. ఈ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ గత కొన్ని రోజులుగా వివిధ రూపాల్లో ఉద్యమిస్తున్న అంగన్వాడీలు ఈ నెల 10న ‘చలో విజయవాడ’కు పిలుపు నిచ్చారు. డిమాండ్లు ఇవీ…ఖీకనీస వేతనం రూ.26 వేలు, గ్రాట్యూటీ అమలు ఖీమినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మార్పు ఖీహెల్పర్ల ఉద్యోగోన్నతులుఖీరాజకీయ జోక్యం అరికట్టాలిఖీసంక్షేమ పథకాలు అమలు ఖీసర్వీసులో ఉండి చనిపోయిన వారికి మట్టి ఖర్చులకు రూ.20 వేలు ఖీకుటుంబ సభ్యులకు కారుణ్య నియామకంఖీసమ్మెకాలంలో చనిపోయిన వారికీ వర్తింపు ఖీపెండింగ్‌లో ఉన్న సెంటర్‌ అద్దెలు, టిఎ, డిఎ బిల్లులు చెల్లించాలి ఖీఅన్ని యాప్‌లు కలిపి ఒకే యాప్‌గా మార్పుఖీపెండింగ్లో ఉన్న 164 సూపర్‌వైజర్ల పోస్టుల భర్తీ ఖీపెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీల పెంపు ఖీప్రభుత్వమే ఉచితంగా గ్యాస్‌ సరఫరా ఖీ3 నెలల వేతనంతో కూడిన మెడికల్‌ లీవ్‌ ఖీప్రీ స్కూల్‌ బలోపేతం ఖీప్రీ స్కూల్‌ పిల్లలకు తల్లికి వందనం పథకం అమలుఖీఐదేళ్లలోపు పిల్లలను అంగన్వాడీ సెంటర్లో ఉంచడంఖీప్రీ స్కూల్‌ పిల్లలకు సాయంత్రం స్నాక్స్‌ అందజేతఖీఆరు నెలలు నుంచి మూడేళ్ల వయసున్న పిల్లలకు ఇకెవైసి, ఫొటోక్యాప్సిర్‌ ఒటిపిలను రద్దు ఆంక్షలు అర్ధరహితంన్యాయబద్ధమైన కోర్కెల పరిష్కారానికి పోరాటమే శరణ్యం, వివిధ రూపాల్లో నిరసనలు తెలిపినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో విజయవాడలో తమ నిరసన తెలపాలని యూనియన్‌ పిలుపునిచ్చింది. ప్రభుత్వం, పోలీసు ఆంక్షలు విధించింది. ఇది ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమే. స్వేచ్ఛగా తమ హక్కుల సాధనకు పోరాడుతుంటే గృహ నిర్భందం అమలు చేస్తున్నారు. – కె.కళ్యాణి, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు

➡️