మాట్లాడుతున్న టౌన్ ప్లానింగ్ రీజనల్ డైరెక్టర్ నాయుడు
ఆమదాలవలస: మున్సిపాల్టీలో అక్రమ కట్టడాలను నియంత్రించి, గృహ నిర్మాణ ప్లాన్ అనుమతులు పొందిన తర్వాతనే భవన నిర్మాణ పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ రీజనల్ డైరెక్టర్ పి.నాయుడు టౌన్ ప్లానింగ్ సిబ్బందిని ఆదేశించారు. పురపాలక సంఘం కార్యాలయంలో కమిషనర్ పి.బాలాజీ ప్రసాద్ అధ్యక్షతన వార్డు ప్లానింగ్ సెక్రటరీలతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లే అవుట్ రెగ్యులరైజేషన్ కింద దరఖాస్తు చేసుకుని పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నేటికీ వసూళ్లు కాకుండా పెండింగ్‌లో ఉన్న ఆక్రమణ ఫీజుల బకాయిలను త్వరితగతిన వసూలు చేయాలన్నారు. సిబ్బంది విధులపై నిర్లక్ష్యం వహిస్తే సచివాలయ వార్డు ప్లానింగ్ సెక్రటరీలపై శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. కార్యక్రమంలో డిటిసిపిఒ ఎం.కృష్ణారావు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఎస్.వరప్రసాదరావు, సచివాలయ వార్డు ప్లానింగ్ సెక్రటరీలు పాల్గొన్నారు.