బాధ్యతలు స్వీకరిస్తున్న సిఐ అవతారం
ప్రజాశక్తి- రణస్థలం, రణస్థలం రూరల్
జె.ఆర్.పురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా ఎం.అవతారం బుధవారం బాధ్యతలు స్వీకరిం చారు. ఎన్నికల అనంతరం జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా జె.ఆర్.పురం సిఐగా ఉన్న జి.రామచంద్రరరావును విఆర్‌లో ఉంచగా, శ్రీకాకుళం ట్రాఫిక్ సిఐగా ఉన్న ఎం.అవతారంను జె.ఆర్.పురం సిఐగా ఉన్నతాధికారులు నియమిం చారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్కిల్ పరిధిలోని ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. అసాంఘిక కార్యక్రమాలపై గట్టి చర్యలు చేపడతామన్నారు. శాంతి భద్రతల విషయంలో రాజీలేకుండా పనిచేస్తామన్నారు. గుట్కా, పేకాట, ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తేలేదన్నారు. ముఖ్యంగా జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదా లు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన సిఐకు సర్కిల్ పరిధిలో ఉన్న ఎస్‌ఐలు, సిబ్బంది అభినందనలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో ఎమ్మెల్యే ఈశ్వరరావును సిఐ మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో శాంతిభద్రతల విషయమై చర్చించారు.