మాట్లాడుతున్న ఎస్‌పి మహేశ్వర రెడ్డి
ప్రజాశక్తి- శ్రీకాకుళం
నగరంలోని పోలీసు సిబ్బంది సంక్షేమంలో నిర్వహిస్తున్న ఆర్ట్స్ కళాశాల రోడ్డు మార్గంలో నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది విశ్రాంతి భవనం, సబ్సిడీ పోలీస్ క్యాంటీన్‌ను గురువారం ఎస్‌పి కె.వి.మహేశ్వర రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్‌పి విశ్రాంతి భవనం నిర్వహణ, మౌలిక వసతులపై ఆరా తీశారు. ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలన్నారు. విధినిర్వహణలో భాగంగా హెడ్ క్వార్టర్స్‌కు వచ్చే సిబ్బంది అందరూ విశ్రాంతి తీసుకున్నందుకు అనుకూలంగా ఉండేటట్లు చూడాలన్నారు. సిపిసి పోలీస్ క్యాంటీన్‌లో అందుబాటులో ఉండే వస్తు సామగ్రి, కిరణా సరుకులను పరిశీలించి సిబ్బందికి ఉపయోగపడే నాణ్యమైన వస్తువులు జిల్లాలో అందరకు సరిపడే వస్తు సామగ్రి అందుబాటులో ఉంచాలన్నారు. కాశీబుగ్గ, టెక్కలి సబ్ డివిజన్ పరిధిలోని సిబ్బంది ప్రతినెలా మొదటి వారంలో సరుకులను అందించాలని సూచించారు.