15న గెస్ట్‌ ఫ్యాకల్టీ నియామకానికి ఇంటర్వ్యూలు

సాంఘిక సంక్షేమ గురుకుల

ప్రజాశక్తి – శ్రీకాకుళం

సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యాన జిల్లాలో నిర్వహిస్తున్న డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గెస్ట్‌ ఫ్యాకల్టీ నియామకానికి ఈనెల 15న ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు గురుకుల విద్యాలయ సంస్థ జిల్లా సమన్వయకర్త బాలాజీ నాయక్‌ ఒక ప్రకటనలో తెలిపారు. దుప్పలవలస, కొల్లివలసలోని గురుకుల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న జూనియర్‌ లెక్చరర్స్‌ మ్యాథ్స్‌కు పురుష అభ్యర్థులు మాత్రమే హాజరు కావాలని తెలిపారు. మందస గురుకులంలో ఇంగ్లీష్‌, బోటనీ, పిజిటి మ్యాథ్స్‌, నందిగాంలో జెఎల్‌ మ్యాథ్స్‌కు మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులని స్పష్టం చేశారు. గెస్ట్‌ ఫ్యాకల్టీ ప్రాతిపదికన ఖాళీ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ, డెమో ద్వారా ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు వారి బయోడేటాతో పాటు పిజి, బిఇడి, టెట్‌ క్వాలిఫైడ్‌ ఒరిజినల్‌ ధ్రువపత్రాలతో హాజరు కావాలని పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఆదివారంపేటలో గల సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యాలయంలో ఈనెల 15న ఉదయం పది గంటల నుంచి డెమో నిర్వహించనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 08942 279926, 9701736862, 9000314209 ఫోన్‌ నంబర్లను సంప్రదించాలని సూచించారు.

➡️