జిల్లాలో ఐటిడిఎ ఏర్పాటు చేస్తాం

జిల్లాలో ఐటిడిఎను ఏర్పాటు

శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న కేంద్ర, రాష్ట్ర మంత్రులు

ప్రజాశక్తి – పాతపట్నం

జిల్లాలో ఐటిడిఎను ఏర్పాటు చేస్తామని కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, అచ్చెన్నాయుడు అన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల బాలుర వసతిగృహం సమీపంలో ప్రధానమంత్రి జన్మాన్‌ వసతిగృహానికి కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎమ్మెల్యే మామిడి గోవిందరావుతో కలిసి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ఎక్కువ శాతం గిరిజనులు ఉన్న నియోజకవర్గం పాతపట్నం అని, ఐటిడిఎ ఏర్పాటు ద్వారా ఇక్కడి గిరిజనులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. గిరిజనులకు అండగా కూటమి ప్రభత్వం ఉంటుందని ఉంటుందన్నారు. ఇందులో భాగంగా గిరిజనుల విద్యాభివృద్ధికి కోడూరులో రూ.230 లక్షల వ్యయంతో 13 గదులు, 16 మరుగుదొడ్లు, భోజనాల గది, రీడింగ్‌ రూమ్‌లతో 50 మంది విద్యార్థులకు అన్ని సదుపాయాలతో జన్మాన్‌ వసతిగృహ నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. విద్యతోనే సమాజం అభివృద్ధి చెందుతుందన్న ఆశయంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయన్నారు. వంద పడకల ఆస్పత్రి మంజూరు చేస్తామని హామీనిచ్చారు. వెనుకబడిన పాతపట్నం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. తొలుత పాతపట్నంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఆర్‌డిఒ సుదర్శనదొర, డిఇఒ తిరుమల చైతన్య, సమగ్రశిక్ష ఇఇ మూర్తి, మండల ప్రత్యేకాధికారి కరుణాకరరావు, ఎంపిడిఒ జయంతి ప్రసాద్‌, తహశీల్దార్‌ కిరణ్‌ కుమార్‌, కూటమి నాయకులు పాల్గొన్నారు.

➡️