నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు

నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు

ఉద్యోగ పత్రాన్ని అందజేస్తున్న ఎమ్మెల్యే గోవిందరావు

ఎమ్మెల్యే గోవిందరావు

ప్రజాశక్తి- పాతపట్నం

నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని ఎమ్మెల్యే గోవిందరావు అన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యాన గురువారం నిర్వహించిన మెగా జాబ్‌మేళాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటువంటి జాబ్‌మేళాలను సద్వినియోగం చేసుకొని యువతీ యువకులు ఆయా పరిశ్రమంలో ఉద్యోగం సాధించడం గొప్ప విషయమన్నారు. వెనుకబడిన నియోజకవర్గంలో ఇటువంటి జాబ్‌మేళాలు ఉపాధి అవకాశాలను కల్పిస్తున్న అరబిందో, అపోలో, టైర్స్‌తోపాటు సుమారు 15 కంపెనీల ప్రతినిధులు ఈ జాబ్‌మేళాను నిర్వహించారని తెలిపారు. పాతపట్నం, మెలియాపుట్టి, కొత్తూరు, హిరమండలం, ఎల్‌ఎన్‌పేట మండలాలతో పాటు పలు గ్రామాల నుంచి సుమారు 650 మంది యువకులు ఈ జాబ్‌మేళాకు హాజరయ్యారని తెలిపారు. ఆసక్తి ఉన్న ఉద్యోగంలో వారు చేరాలని సూచించారు. అనంతరం ఉద్యోగ పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ శ్రీరాములు, నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా మేనేజర్‌ సాయి, ఎంప్లాయిమెంట్‌ అధికారిని సుధారాణి, సెట్‌ సిఇఒ ప్రసాద్‌ పాల్గొన్నారు.

 

➡️