సాహితీ లోకానికి కలికితురాయి ‘కా.రా’

కాళీపట్నం రామారావు (కా.రా మాస్టారు) తెలుగు సాహిత్య

కాళీపట్నం రామారావు మాస్టారు శతజయంతి సందర్భంగా నేడు సెమినార్‌

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

కాళీపట్నం రామారావు (కా.రా మాస్టారు) తెలుగు సాహిత్య రంగంలో కీర్తికెక్కిన పేరు. ఆయన తెలుగు కథలకు ప్రసిద్ధి చెందిన భారతీయ కవి, రచయిత. యజ్ఞంతో తొమ్మిడి అనే చిన్న కథలకు 1995లో తెలుగులో సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకున్నారు. కా.రా మాస్టారు శ్రీకాకుళం జిల్లాలోని మురపాకలో 1924లో జన్మించారు. విశాఖపట్నంలోని సెయింట్‌ ఆంథోనీస్‌ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా అనేక సంవత్స రాలు పనిచేసి 1979లో ఉద్యోగ విరమణ పొందారు. కాళీపట్నం రామారావు స్ఫూర్తితో రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌ తన రచనా ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆయనను గురువుగా భావిస్తారు. రామారావుగారి కథలు సమాజంలోని మధ్యతరగతి అట్టడుగు వర్గాల ప్రజల్లో ఎదురయ్యే కష్టాలు, అప్పుడప్పుడు దక్కే జీవిత విజయాలను ప్రతిబింబిస్తాయి. కాళీపట్నం ప్రత్యేకంగా అతని మానసిక అంతర దృష్టికి రోజువారీ జీవితంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రభావాలను ప్రతిస్పందిస్తూ కథారచనలు చేసేవారు. అతని మొదటి కథ, ‘చిత్రగుప్త’, ఒక చిన్న కథ, పోస్టుకార్డు వెనుక రాశారు. ఆయన తన రచనలతో సంతృప్తి చెందక 1955లో ఆగిపోయాడు. ఎనిమిదేళ్ల తర్వాత 1963లో ‘తీర్పు’ రాశాడు. ఆ తరువాత 1960ల చివరలో ‘యజ్ఞం’, ‘మహాదా శీర్వచనము’, ‘వీరుడు-మహావీరుడు’ వంటి అనేక కథలు రాశారు. ‘అదివారం’, ‘హింస’, ‘నో రూమ్‌’, ‘స్నేహం’, ‘ఆర్తి’, ‘భయం’, ‘శాంతి’, ‘చావు’, ‘జెవ్వన ధార’, ‘కుట్ర’, ‘కుట్ర’ రాసిన తరువాత, అతను రాయడం మానేశారు. అతని కథలు రష్యన్‌, ఆంగ్లంతో సహా వివిధ విదేశీ భాషల్లోకి అనువదించబడ్డాయి. కాళీపట్నం విప్లవ రచయితల సంఘం కార్యవర్గ సభ్యుడు కూడా. అతను 1995లో ‘సెంట్రల్‌ కల్చరల్‌ అకాడమీ అవార్డు’ గెలుచుకున్నాడు. విశాఖప ట్నానికి చెందిన లోక్‌ నాయక్‌ ఫౌండేషన్‌ 18 జనవరి 2008న సత్కరించారు. తెలుగు సాహితీ లోకంలో ‘కా.రా మాష్టారు’ అని ముద్దుగా పిలుచుకునే కాళీపట్నం రామారావు దాదాపు ఆరు దశాబ్దాల సుదీర్ఘ సాహిత్య ప్రస్థానాన్ని కలిగి ఉన్న దిగ్గజం. కా.రా మాస్టారు శతజయంతి ఉత్సవాలను ఆదివారం సాహితీ స్రవంతి- శ్రీకాకుళ సాహితి సంయుక్తంగా నిర్వహించనున్నారు. నగరంలోని బాపూజీ కళామందిర్‌లో ఈ ఉత్సవాల్లో బాగంగా సెమినార్‌ను నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు వరకు సాగే ఈ సెమినార్‌లో నాలుగు సెషన్లుగా నిర్వహిస్తున్నారు. ప్రారంభ సభకు వీరుడు- మహావీరుడు వంటి ప్రఖ్యాత రచనలున్నాయి. ప్రారంభ సభలో స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్‌, అంబేద్కర్‌ విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ కె.ఆర్‌.రజిని శాసన మండలి పూర్వ సభ్యులు ఎం.వి.ఎస్‌.శర్మ, రచయితలు గంటేడ గౌర్నాయుడు అట్టాడ అప్పలనాయుడు, గార రంగనాథం, పొన్నాడ వరాహ నరసింహులు, కార్యదర్శి చీకటి దివాకర్‌ తదితరులు పాల్గొంటారు. రెండు సెషన్లలో కా.రా మాస్టారు రచించిన శతాధిక కథల నుంచి ఎంపిక చేసుకున్న వాటిపై విశ్లేషణాత్మక పత్రాలను 10 మంది సాహితీవేత్తలు సమర్పించనున్నారు. విశ్లేషణాత్మక పత్రాలను దుప్పల రవికుమార్‌ – యజ్ఞం కథ ప్రతిఫలాలు, కంచరాన భుజంగరావు అభిమానాలు, తీర్పు, లండ సాంబమూర్తి, మహదాశీర్వచనం, హింస, బాడాన శ్యామలరావు ఆదివారం, ఆర్తి కథలపై విశ్లేషిస్తారు. అలాగే అల్తి మోహనరావు రాగమయి, చావు, పూజారి దివాకర్‌ నోరూమ్‌, స్నేహం, మల్లిపురం జగదీష్‌ భయం, జీవధార, డాక్టర్‌ కె.ఉదరుకిరణ్‌, ప్లాటుఫారమో, పలాయి తుడు, బాలసుధాకర మౌళి వీరుడు మహావీరుడు, కుట్ర, చింతాడ తిరుమలరావు శాంతి, అవివాహితగానే ఉండిపోతా కథలను విశ్లేషిస్తారు. ఈ సందర్భంగా సాహితీ స్రవంతి కన్వీనర్‌ కె.శ్రీనివాసు మాట్లాడుతూ కథానిలయం వ్యవస్థాపకులు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత కాళీపట్నం రామారావు శ్రీకాకుళం జిల్లా సాహితీ లోకానికి కలికితురాయి వంటి వారని, ఆయన శతజయంతి నిర్వహించడం ఎంతో స్ఫూర్తి దాయకమని అన్నారు. ఈ సందర్భంగా నివాళ్లర్పించేందుకు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం తదితర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో సాహితీవేత్తలు, సాహిత్య అభిమానులు తరలి వస్తున్నారని తెలిపారు.

➡️